సీఎం అవుతానన్న వ్యాఖ్యలపై పవన్ యూ- టర్న్

సీఎం అవడానికి సరిపడా బలం ఇవ్వకుండా సీఎం అవ్వాలంటే ఎలా అని గతంలో ప్రశ్నించిన మీరు.. ఇటీవల నేనే సీఎం అంటున్నారు. ఈ తేడా ఎందుకు అని ప్రశ్నించగా.. '' సీఎం అని మా వాళ్ల కోసం అన్నాను'' అని క్లారిటీ ఇచ్చారు.

Advertisement
Update:2023-06-21 11:29 IST

ముఖ్యమంత్రి పదవిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మళ్లీ యూ- టర్న్ తీసుకున్నారు. సీఎం అయ్యే ఆలోచన తనకు లేదని పరోక్షంగా చెప్పేశారు. ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై స్పందించిన పవన్ కల్యాణ్.. అభిమానుల కోసమే ''సీఎం'' అన్నాను అని తేల్చేశారు. సీఎం అవడానికి సరిపడా బలం ఇవ్వకుండా సీఎం అవ్వాలంటే ఎలా అని గతంలో ప్రశ్నించిన మీరు.. ఇటీవల నేనే సీఎం అంటున్నారు. ఈ తేడా ఎందుకు అని ప్రశ్నించగా.. '' సీఎం అని మా వాళ్ల కోసం అన్నాను'' అని క్లారిటీ ఇచ్చారు.

కోట్ల మంది జీవితాలను ముందుకు తీసుకెళ్లే పదవి అంటే చాలా అనుభవం కావాలి, దీనికి క్షేత్రస్థాయిలో పర్యటనలు, సమస్యలపై అవగాహన తెచ్చుకోవాలి అంటూ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఏదైనా సరే పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు. ''వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలవు. పార్టీల మధ్య కొన్ని సర్దుబాట్లు, రాజీలు, త్యాగాలు తప్పవు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయి. అధికారపార్టీని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాయి'' అని తేల్చేశారు.

టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి రావాల్సిన అవసరం ఉందని.. తన సైడ్‌ నుంచి తాను చెప్పానని.. ఇప్పటికే చంద్రబాబును మూడుసార్లు కలిసినట్టు వివరించారు. పొత్తులపై ఎన్నికల దగ్గరపడితే మరింత స్పష్టత వస్తుందన్నారు. సో.. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు బట్టి ఆయనకు సీఎం అవ్వాలనే ఆశ‌ లేదు. అభిమానుల కోసం మాత్ర‌మే సీఎం అవుతా అని మాట్లాడిన‌ట్టుగా తేల్చేశారు. కేవలం జగన్‌ను ఓడిస్తే చాలు. చంద్రబాబుతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప‌వ‌న్ మాటలను బట్టే అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News