డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు పలువురు సీనియర్ అధికారులు అభినందనలు తెలిపారు. ఇంద్రకీలాద్రి వేద పండితులు పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనం ఇచ్చారు.

Advertisement
Update: 2024-06-19 07:05 GMT

ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో పవన్ కు కేటాయించిన క్యాంపు కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సరిగ్గా 10 గంటల 47 నిమిషాలకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన డిప్యూటీ సీఎం హోదాలో పలు ఫైళ్లపై సంతకాలు చేశారు.

ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపనున్నారు. వరుస భేటీలు, అధికారులతో సమావేశాలతో ఆయన బిజీగా ఉండనున్నారు. ముందుగా ఆయన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో, ఆ తర్వాత గ్రూప్ 1,2 అధికారులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ తో భేటీకానున్నారు.

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ కు పలువురు సీనియర్ అధికారులు అభినందనలు తెలిపారు. ఇంద్రకీలాద్రి వేద పండితులు పవన్ కళ్యాణ్ కు ఆశీర్వచనం ఇచ్చారు. సాయంత్రం వరకు వరుస సమావేశాలతో బిజీగా ఉండనున్న పవన్ కళ్యాణ్ రాత్రి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బస చేయనున్నారు. కాగా, పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News