పిఠాపురం నుంచే పోటీ చేస్తా
ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారంపైనా స్పష్టత ఇచ్చారు. ఎంపీగా పోటీ చేయమని అడుగుతున్నారని, కానీ తనకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదన్నారు.
త్వరలో జరగబోయే ఎన్నికల్లో తాను ఎక్కడినుంచి పోటీ చేస్తానన్న అంశంపై క్లారిటీ ఇచ్చారు జనసేనాని పవన్‌కల్యాణ్. మొత్తానికి సస్పెన్స్‌కు తెరదించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగుతానని స్వయంగా ప్రకటించారు.
ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారంపైనా స్పష్టత ఇచ్చారు. ఎంపీగా పోటీ చేయమని అడుగుతున్నారని, కానీ తనకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదన్నారు. ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానన్నారు. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన జనసేనాని రెండు చోట్లా ఓడిపోయారు.
పొత్తులో భాగంగా జనసేనకు 21 సీట్లు కేటాయించింది తెలుగుదేశం. ఇప్పటికే ఐదు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు పవన్. తాజాగా తన పోటీపై క్లారిటీ ఇవ్వడంతో మొత్తం ఆరు స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినట్లయింది. ఇక పిఠాపురం వైసీపీ ఇన్‌ఛార్జిగా ప్రస్తుతం వంగా గీత కొనసాగుతున్నారు. ముద్రగడ పార్టీలో చేరితే ఆయనను పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంచుతారని తెలుస్తోంది.