వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్..

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదువు తప్పాయని ఆరోపించారు పవన్‌ కల్యాణ్‌. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-08-12 17:49 IST

వాలంటీర్లను మరోసారి రెచ్చగొట్టేలా మాట్లాడారు పవన్ కల్యాణ్. వాలంటీర్ వ్యవస్థ దండుపాళ్యం బ్యాచ్ లా తయారైందని అన్నారు. విశాఖ పట్నం సుజాత నగర్ లో వాలంటీర్ చేతిలో హత్యకు గురైన వృద్ధురాలు వరలక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కల్యాణ్.. మరోసారి ప్రభుత్వం, వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేస్తే, కనీసం అధికార పార్టీ నేతలు పరామర్శకు రాలేదని విమర్శించారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని చెప్పారు పవన్.


ఇదెక్కడి ఘోరం..

విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కూడా పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన రౌడీషీటర్లతోనే ఎంపీ మిలాఖత్‌ అయ్యారన్నారు. "ఎంపీ ఇంట్లో వాళ్లపై అఘాయిత్యానికి పాల్పడిన వాళ్లను చూసి భయపడతారేంటి..? డబ్బులతో ఓట్లు కొనుగోలు చేసిన వాళ్లే ఇలా వ్యవహారస్తారు. ఈ వ్యవహారం ఎంపీ ఇంటికి పరిమితం కాదు. కేంద్రం దృష్టికి తీసుకెళ్తా"మని ప్రకటించారు పవన్‌ కల్యాణ్‌.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదువు తప్పాయని ఆరోపించారు పవన్‌ కల్యాణ్‌. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరాలకు పాల్పడుతున్నారన్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువగా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దండుపాళ్యం బ్యాచ్ లాగా వాలంటీర్లు ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని విమర్శించారు. ఒంటరి మహిళలే వాలంటీర్ల టార్గెట్‌ అని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. వైసీపీ సమాంతర వ్యవస్థ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోందని అన్నారు పవన్. 

Tags:    
Advertisement

Similar News