నాదెండ్ల మనోహర్ చేతిలో పవన్ కల్యాణ్ పావు..?
పవన్ కల్యాణ్ పూర్తిగా నాదెండ్ల మనోహర్‌పై ఆధారపడటం పెద్ద తప్పుగా భావిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి మీడియా సమావేశంలో జరిగిన ఉదంతాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
జనసేన సేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్‌పై పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు మండిపడుతున్నారు. పవన్ కల్యాణ్‌ను ఆయన తప్పుదారి పట్టించారని వారు విమర్శిస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహం ప్రకారం ఆయన నడుచుకుంటున్నట్లు చెప్పుతున్నారు. సీట్ల పంపకంలో జనసేనకు అన్యాయం జరగడానికి అదే కారణమని అంటున్నారు.
పవన్ కల్యాణ్ పూర్తిగా నాదెండ్ల మనోహర్‌పై ఆధారపడటం పెద్ద తప్పుగా భావిస్తున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి మీడియా సమావేశంలో జరిగిన ఉదంతాన్ని వారు గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పక్కా ప్లాన్ ప్రకారం అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తే, పవన్ కల్యాణ్ మాత్రం నాదెండ్ల మనోహర్ రాసిచ్చిన ఐదు పేర్లను చదివి వదిలేశారని అంటున్నారు. వాటిలో నాదెండ్ల మనోహర్ పేరు ఉంది. ఆయన తెనాలి నుంచి పోటీ చేయబోతున్నారు.
జనసేనకు కేవలం 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలు ఇస్తామని చంద్రబాబు చెప్తే పవన్ కల్యాణ్ తల ఊపడం వెనక కూడా నాదెండ్ల మనోహర్ హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీట్ల పంపకం సరే, జనసేనకు బలహీనమైన స్థానాలను చంద్రబాబు కట్టబెట్టడం వెనక కూడా రాజకీయం ఉందని, ఇందులో నాదెండ్ల మనోహర్ పాత్ర ఉందని అంటున్నారు.
పవన్ కల్యాణ్ కూడా భీమవరం నుంచి పోటీ చేయకపోవడానికి కారణం చంద్రబాబు రాజకీయమని అంటున్నారు. పవన్ కల్యాణ్ పిఠాపురం సీటును ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏమైనా పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్ చేతిలో పావుగా మారారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.