వాలంటీర్లు వర్సెస్ పవన్.. ఇక రచ్చ రచ్చే
వాలంటీర్ల వ్యవస్థను పవన్ దారుణంగా అవమానించారని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. వాలంటీర్లకు సిగ్గు, శరం, ఆత్మాభిమానం ఉంటే వెంటనే పవన్ పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.
ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు దారుణ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నాయి. వాటికి పరాకాష్ట తాజాగా ఏలూరులో పవన్ చేసిన విమర్శలు. ఏపీలో వుమన్ ట్రాఫికింగ్ కి ముఖ్య కారణం వాలంటీర్లేనని అన్నారాయన. వాలంటీర్లు తమ పరిధిలోని ఇళ్లలో ఒంటరి మహిళలు ఎవరు, ఎవరెవరికి ఎలాంటి సంబంధాలున్నాయి, ఎవరి అవసరాలేంటి అని తెలుసుకుని అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారని, ఫలితంగా మహిళల అక్రమ రవాణా జరుగుతోందన్నారు. కేంద్ర నిఘా వ్యవస్థలు ఈ సమాచారాన్ని తనకు చేరవేశాయని కూడా పవన్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ఇప్పుడు రచ్చ మొదలైంది.
వాలంటీర్ల వ్యవస్థను పవన్ దారుణంగా అవమానించారని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దీనిపై రామ్ గోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. వాలంటీర్లకు సిగ్గు, శరం, ఆత్మాభిమానం ఉంటే వెంటనే పవన్ పై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. అమ్మాయిల బ్రోకర్లు అంటూ వాలంటీర్లను పవన్ నీఛాతి నీఛంగా మాట్లాడారని మండిపడ్డారు.
2 లక్షల పుస్తకాలు చదివానని చెప్పుకునే పవన్ జీరో ఎవిడెన్స్ ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ. భవిష్యత్తులో పవన్, జగన్ పై కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తారేమో అని అనుమానం వ్యక్తం చేశారు వర్మ. అల్ ఖైదాకి ఫండింగ్ చేసింది జగనేనని, సౌదీ జర్నలిస్ట్ హత్యకి జగన్ కారణం అని, ప్రపంచ స్కామ్ లన్నిటికీ జగనే మూలం అని పవన్ అంటారని తేల్చేశారు.
వైసీపీ రియాక్షన్ ఏంటి..?
ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై వైసీపీనుంచి ఎలాంటి రియాక్షన్ లేదు. వాలంటీర్లపై పవన్ చేసిన ఆరోపణలపై వైసీపీ నేతలెవరూ ఇంకా స్పందించలేదు. ఈరోజు పవన్ కి కౌంటర్లు మొదలయ్యే అవకాశాలున్నాయి. అయితే అందరికంటే ముందు వాలంటీర్ల తరపున రామ్ గోపాల్ వర్మ స్పందించడం విశేషం.