భీమ‌వ‌రం నుంచి ప‌వ‌న్ పోటీ ఖాయ‌మే..!

నేరుగా టీడీపీ జిల్లా అధ్య‌క్షురాలు తోట సీతారామ‌ల‌క్ష్మి, మాజీ ఎమ్మెల్యే పుల‌వ‌ర్తి అంజిబాబుల ఇళ్లకు వెళ్లి క‌లిశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రంలో టీడీపీ, జ‌నసేన ఉమ్మ‌డిగా అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించారు.

Advertisement
Update:2024-02-21 14:56 IST

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమ‌వరం నుంచే పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మైపోయినట్టే క‌నిపిస్తోంది. ఈరోజు ఉద‌యం ప‌వ‌న్ రాజ‌మండ్రి నుంచి నేరుగా భీమ‌వరం వెళ్లారు. టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌తో భేటీ అయ్యారు. జిల్లాలోని టీడీపీ సీనియ‌ర్ నేత‌లు, మాజీ ఎమ్మెల్యేలు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

భీమవ‌రంలో గెలుపు కోసం వ్యూహ‌ర‌చ‌న‌

ప‌వ‌న్ నేరుగా టీడీపీ జిల్లా అధ్య‌క్షురాలు తోట సీతారామ‌ల‌క్ష్మి, మాజీ ఎమ్మెల్యే పుల‌వ‌ర్తి అంజిబాబుల ఇళ్లకు వెళ్లి క‌లిశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో భీమ‌వ‌రంలో టీడీపీ, జ‌నసేన ఉమ్మ‌డిగా అనుస‌రించాల్సిన వ్యూహంపై చ‌ర్చించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు పితాని స‌త్య‌నారాయ‌ణ‌, ఆరిమిల్లి రాధాకృష్ణ‌, ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు, త‌దిత‌రులు ఈ భేటీకి హాజ‌ర‌య్యారు.

వ‌ద్ద‌న్నా వినరే!

ఉద‌యం భీమ‌వ‌రం చేరుకోగానే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అభిమానులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. పట్ట‌ణంలో భారీ ర్యాలీ తీశారు. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ ఇక్క‌డి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్య‌ర్థి గ్రంథి శ్రీ‌నివాస్ చేతిలో ఓడిపోయారు. అస‌లు ప‌వ‌న్‌కు ఆ సీటు రాంగ్ చాయిస్ అని, ఈసారైనా స్థానం మారితే బాగుంటుంద‌ని జ‌న‌సేన‌లోనే చాలామంది భావిస్తున్నారు. కానీ, ప‌వ‌న్ మాత్రం ఇక్క‌డే పోటీ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతుండ‌టం గ‌మ‌నార్హం.

Tags:    
Advertisement

Similar News