స్వతంత్రులకు గాజు గ్లాసు.. జగన్ కుట్ర అంటూ పవన్ ఏడుపు

పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా కనీసం గుర్తు కూడా తెచ్చుకోలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారని... ఆ ఫ్రస్టేషన్ లో ఇలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement
Update:2024-05-04 10:57 IST

జనసేన పోటీలో లేని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తుని కేటాయించింది ఎన్నికల కమిషన్. కొన్ని మినహాయింపులున్నా.. కూటమి గెలుపుపై ఇది తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలున్నాయని తేలిపోయింది. అయితే దీనికి కారణం జగన్ అంటూ పవన్ కల్యాణ్ కొత్త పల్లవి అందుకున్నారు. కూటమికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక జగన్ ఇలా కుట్రలు చేశారని ఆరోపించారు.

అదే నిజమైతే..

నిజంగానే జగన్ ఎన్నికల కమిషన్ ని ప్రభావితం చేసి స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించేలా చేసి ఉంటే.. ఆ మినహాయింపులు కూడా ఎందుకు ఉంటాయని అంటున్నారు నెటిజన్లు. ఫ్రీ సింబల్ గా ఉన్న గాజు గ్లాసుని అసలు జనసేన అభ్యర్థులకు కూడా లేకుండా చేసేవారు కదా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ పెట్టి పదేళ్లవుతున్నా కనీసం గుర్తు కూడా తెచ్చుకోలేని స్థితిలో పవన్ కల్యాణ్ ఉన్నారని... ఆ ఫ్రస్టేషన్ ఇప్పుడు జగన్ పై చూపెడుతున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

ఇటీవల తన ప్రచారంలో కూడా పవన్ కల్యాణ్ గుర్తు కోల్పోవడంపై అసహనం వ్యక్తం చేశారు. సీఎం సీఎం అంటూ అరుస్తున్న అభిమానులను కసురుకున్నారు. సీఎం అవుతానో కానో తనకు తెలియదని.. జనసేనను గుర్తింపు ఉన్న పార్టీగా చేయడమే తన ముందున్న ప్రథమ కర్తవ్యం అని అన్నారు పవన్.

వంత పాట..

చంద్రబాబు ఆల్రడీ తాము అధికారంలోకి వచ్చినట్టు ఊహించుకుంటున్నారు. మొదటి సంతకం, రెండో సంతకం అంటూ హడావిడి చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కూడా ఆయనకు వంత పాడుతున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోని తూచా తప్పకుండా అమలు చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపెడుతున్నారు. చంద్రబాబుకి వంతపాడుతున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే వెలిగొండ ప్రాజెక్టులో నీరు నింపుతామని, మెగా డీఎస్సీ ప్రకటిస్తామని అంటున్నారు. పిఠాపురంలో గెలిచి, 5 కోట్లమంది ప్రజల కోసం పనిచేసేందుకు తాను అసెంబ్లీలో అడుగుపెడతానంటున్నారు పవన్. 

Tags:    
Advertisement

Similar News