చంద్రబాబు కోసమే పవన్ పుట్టాడు, పనిచేస్తున్నాడు..

చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ అని, వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానని ఆయన చెప్పడం హాస్యాస్పదం అన్నారు అంబటి.

Advertisement
Update:2023-03-30 16:59 IST

పవన్ కల్యాణ్, చంద్రబాబు కోసమే పుట్టాడని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. బాబు కోసమే పుట్టి, బాబుకోసమే పనిచేస్తున్నాడని, పనిచేస్తాడని కూడా చెప్పారు. అలాంటి వ్యక్తిని దేవుడే రక్షించాలన్నారు అంబటి. ఓటు చీలకుండా చేస్తామని పవన్ చెప్పడం కొత్తేమీ కాదన్నారు. ఒంటిమిట్ట రామాలయంలో పట్టువస్త్రాలు సమర్పించిన ఆయన, చంద్రబాబు, పవన్ పై ఘాటుగా స్పందించారు.

పునర్నిర్మాణం అంటే ఆస్తులు, కొడుకు జీవితమే..

టీడీపీ ఆవిర్భావ దినోత్సంవం సందర్భంగా చంద్రబాబు ఏపీ పునర్నిర్మాణ బాధ్యతలు తీసుకుంటానన్న వ్యాఖ్యలపై కూడా అంబటి ఘాటుగా స్పందించారు. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ అని, వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానని ఆయన చెప్పడం హాస్యాస్పదం అన్నారు. మరో అవకాశం ఇస్తే పోలవరాన్ని నాశనం చేసినట్లే రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేస్తారంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకును పునర్నిర్మిస్తాడు తప్ప ప్రజలకు ఏమీ ఒరగదని చెప్పారు.

పోలవరం విషయంలో జరిగిన తప్పిదాలన్నిటికీ గత ప్రభుత్వం భాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు అంబటి. టీడీపీ తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణంలో సమస్యలు వచ్చాయన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాయన్నారు.

అది నిరూపించలేం..

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు చేతులు మారాయని ఆరోపించారు మంత్రి అంబటి రాంబాబు. తెలంగాణలో లాగా దాన్ని తాము నిరూపించలేకపోవచ్చు కానీ, టీడీపీ ఆ నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని అన్నారు అంబటి.

Tags:    
Advertisement

Similar News