మరీ ఓవర్‌గా లేదూ..

వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో మొదలైంది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌ మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. అదేమిటంటే ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ రహిత జిల్లాలుగా మారుస్తానని.

Advertisement
Update:2023-06-27 11:20 IST

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ వ్యవహారం మరీ ఓవర్‌గా అనిపిస్తోంది. వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురంలో మొదలైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. అదేమిటంటే ఉభయ గోదావరి జిల్లాలను వైసీపీ రహిత జిల్లాలుగా మారుస్తానని. రెండు జిల్లాల్లో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్కచోట కూడా వైసీపీని గెలవనివ్వనని చాలెంజ్ చేశారు. వైసీపీని గెలవనివ్వనని పవన్ చాలెంజ్ చేయటం ఏమిటో అర్థంకావటంలేదు.

ఒక పార్టీని గెలవనివ్వకూడదని అనుకున్నా, నేత గెలవకూడదని అనుకున్నా అంతా జనాల చేతుల్లోనే ఉంటుంది. 2019 ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా వైసీపీని గెలవనివ్వనని, జగన్ ముఖ్యమంత్రి ఎలా అవుతాడో చూస్తానని పదేపదే చాలెంజ్‌లు విసిరారు. ఏమైంది? వైసీపీ అధికారంలోకి రాకుండా ఆపగలిగారా? జగన్‌ను సీఎం కాకుండా అడ్డుకోగలిగారా? పవన్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఏమైంది? తన పరిపాలనలో జనాలు 95 శాతం మంది సంతృప్తిగా ఉన్నారని ప్రకటించిన చంద్రబాబునాయుడు పరిస్థితి ఏమైంది?

151 సీట్ల అఖండ విజయంతో జగన్ సీఎం అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. 95 శాతం జనాలు సంతృప్తిగా ఉన్నారని చెప్పుకున్న చంద్రబాబు 23 సీట్లకు పరిమితమయ్యారు. కాబట్టి ఎవరేమి చెప్పుకున్నా వాళ్ళ చేతుల్లో ఏమీ ఉండదు జనాలు అనుకుంటేనే ఏమైనా అవుతుంది. ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చినా కూడా పవన్‌లో ఇంకా జ్ఞానోదయం కాలేదంటే ఆశ్చర్యంగా ఉంది.

పవన్‌లో సమస్యలు నాలుగున్నాయి. అవేమిటంటే తాను జగన్ కన్నా చాలా అధికుడననేది మొదటిది. రెండోది జగన్‌ను సీఎంగా చూడలేక, జీర్ణించుకోలేకపోతున్నారు. తనను ఓడించారనే మంట రోజురోజుకు పెరిగిపోతోంది. జనసేనను జగన్ ఒక పార్టీగానే గుర్తించటంలేదని, తనను ఒక నేతగా జగన్ పరిగణించటంలేదనే మంట పవన్‌లో బాగా పెరిగిపోయింది. అందులో నుండి వచ్చిన ఉక్రోషంతోనే నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. ప్రజల డబ్బును ప్రజలకే పంచుతూ జగన్ చాలా ఫోజులు కొడుతున్నట్లు మండిపడ్డారు. ఏ ప్రభుత్వమైనా ప్రజల డబ్బే ప్రజలకు పంచిపెడుతుందన్న చిన్న విషయం కూడా పవన్‌కు తెలియ‌దా? రేపు తాను ముఖ్యమంత్రి అయితే సొంత డబ్బును పథకాలకు ఖర్చు పెడతారా? ఏమిటో చివరకు పవన్ ఇలాగైపోయారు.

Tags:    
Advertisement

Similar News