పొత్తుల్లో రికార్డ్ బ్రేక్.. సోషల్ మీడియాలో పవన్ ట్రెండింగ్

ఏ ఎండకాగొడుగు పట్టడంలో చంద్రబాబుకి సరిసాటి ఎవరూ లేరనేది ఇప్పటి వరకూ ఉన్నమాట. ఇకపై ఆ స్థానాన్ని పవన్ కల్యాణ్ భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Advertisement
Update:2023-11-05 12:58 IST

పొత్తుల్లో రికార్డ్ బ్రేక్.. సోషల్ మీడియాలో పవన్ ట్రెండింగ్

ఓసారి కాంగ్రెస్ తో, మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు సృష్టించిన రికార్డ్ ఇప్పటి వరకు పదిలంగా ఉంది. అలాంటి రికార్డ్ ని కూడా బీట్ చేశారు పవన్ కల్యాణ్. ఏక కాలంలో ఏపీలో టీడీపీతో, తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పోనీ ఓ ప్రాంతీయ పార్టీ, మరో జాతీయ పార్టీతో పొత్తు అంటే పెద్దగా ఇబ్బంది లేదు అనుకోవచ్చు. కానీ దానికి కూడా ఇక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే.. పవన్ ఏపీలో పొత్తు పెట్టుకున్న టీడీపీ, తెలంగాణలో లోపాయికారీగా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తోంది. అంటే బీఆర్ఎస్ కి, బీజేపీకి వ్యతిరేకంగా అన్నమాట. అదే సమయంలో పవన్ కల్యాణ్ జనసేన మాత్రం తెలంగాణలో బీజేపీతో పొత్తు ఖరారు చేసుకుంది, మిత్రపక్షంగా బరిలో దిగబోతోంది. ఇది కేవలం పవన్ కల్యాణ్ కి మాత్రమే సాధ్యమైన విన్యాసం అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.


ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఈ పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ పై సెటైర్లు పేల్చారు. విలువలు లేని తమకే ఇది సాధ్యం అంటూ పవన్ పై ట్వీట్ వేశారు. ఏపీలో చంద్రబాబుతో కలసి ఉన్న ఫొటో, తెలంగాణలో కిషన్ రెడ్డితో పవన్ కలసి ఉన్న ఫొటోను తన ట్వీట్ కి జతచేశారు.

చంద్రబాబుని మించిపోతారా..?

ఏ ఎండకాగొడుగు పట్టడంలో చంద్రబాబుకి సరిసాటి ఎవరూ లేరనేది ఇప్పటి వరకూ ఉన్నమాట. ఇకపై ఆ స్థానాన్ని పవన్ కల్యాణ్ భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పవన్ కూడా సరిగ్గా ఏ ఎండకు ఆ గొడగు పట్టే రకం అంటున్నారు. ఇటు అవసరం కొద్దీ టీడీపీతో అంటకాగుతూ.. అటు తెలంగాణలో బీజేపీతో కలసి ఉంటున్నారు. మొత్తానికి ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం పవన్ బాగా కృషి చేస్తున్నట్టు తెలుస్తున్నా.. చంద్రబాబుని నమ్మేందుకు బీజేపీ మాత్రం సిద్ధంగా లేదు. అందుకే తమ పొత్తు కేవలం జనసేనతో మాత్రమేనంటోంది కమలదళం. 

Tags:    
Advertisement

Similar News