జగన్ పుట్టక ముందునుంచీ.. జగన్ ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు

ఆరోపణలు చేయడంలో చాలామంది నేర్పుగా వ్యవహరిస్తుంటారు, తమకు ఎవరో నమ్మకస్తులు చెప్పినట్టు, ఆధారాలున్నట్టు మాట్లాడతారు. కానీ పవన్ వ్యవహారం వేరు. తానే నేరుగా చూసినట్టు మాట్లాడటం పవన్ అజ్ఞానానికి నిదర్శనం.

Advertisement
Update:2023-10-04 13:04 IST

పవన్ కల్యాణ్ లో ఫ్రస్టేషన్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆయన మాటల్లో, చేతల్లో ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. సీఎం జగన్ గురించి ఎలాంటి విమర్శలు చేసినా జనం నమ్మకపోవడంతో ఆయన చిన్నప్పటి విషయాలు కూడా తెలిసినట్టే చెబుతున్నారు పవన్. జగన్ చిన్నప్పటి నుంచి, టీనేజ్ వయసులో కూడా తనకు తెలుసని అన్నారు పవన్. మచిలీపట్నం మీటింగ్ లో జగన్ పై సెటైర్లు పేల్చాలనే ఉద్దేశంతో తన అజ్ఞానాన్ని అలా బయటపెట్టుకున్నారు. 1920 నుంచీ జగన్ తనకు తెలుసన్నారు పవన్. అంటే జగన్ పుట్టక ముందు నుంచీ, ఆ మాటకొస్తే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టక ముందు నుంచీ జగన్ గురించి పవన్ కి తెలిసుండాలి. పాపం అప్పుడు పవన్ కూడా పుట్టకుండానే, జగన్ గురించి తెలుసుకున్నాడనమాట.

పోనీ ఫ్లోలో 1920 అన్నాడే అనుకుందాం. అసలు జగన్ చిన్న తనంలో పవన్ హైదరాబాద్ లో ఎక్కడున్నారు. బాపట్ల, నెల్లూరు.. ఇలా తన తండ్రి ట్రాన్స్ ఫర్ అయినచోటికళ్లా వారి ఫ్యామిలీ వెళ్లింది, ఆ తర్వాత హైదరాబాద్ లో సెటిలైంది. ఆ టైమ్ లో అసలు వైఎస్ఆర్ ఫ్యామిలీతో పవన్ కు పరిచయం ఏంటి..? వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జగన్ గురించి మీడియాకు, బయటి ప్రపంచానికి పరిచయమైంది. అయితే అంతకు ముందే, టీనేజ్ నుంచే జగన్ తనకు పరిచయం ఉన్నట్టుగా, ఆయన గుణగణాలన్నీ అవపోసన పట్టినట్టుగా పవన్ మాట్లాడటం, అంత ధీమాగా మీడియా ముందు చెప్పడం విశేషం.

ఏదైనా అంతేనా..?

ఆరోపణలు చేయడంలో చాలామంది నేర్పుగా వ్యవహరిస్తుంటారు, తమకు ఎవరో నమ్మకస్తులు చెప్పినట్టు, ఆధారాలున్నట్టు మాట్లాడతారు. కానీ పవన్ వ్యవహారం వేరు. తానే నేరుగా చూసినట్టు మాట్లాడటం పవన్ అజ్ఞానానికి నిదర్శనం. 2019 ఎన్నికల ప్రచారంలో పవన్ సభలో కరెంటు పోతే దానికి కారణం చంద్రబాబు, లోకేష్ అని చెప్పుకొచ్చారు. తనను చంపేందుకు వారు కుట్రలు చేశారని అన్నారు. ఆ తర్వాత సీఎం జగన్ పై కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. ఇదివరకు కూడా తనను చంపేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు పెడన మీటింగ్ విషయంలో కూడా అలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు పవన్. నేరుగా పవన్ రౌడీమూకల రాకని చూసినట్టు, తనపై రాళ్లు వేయడానికి వచ్చినట్టు ఊహించుకుని మాట్లాడటమే మరీ విచిత్రంగా తోస్తుంది.

పవన్ మాటలను జనం పట్టించుకుంటారా..?

ఫ్రస్టేషన్ పెరిగిపోయి, జగన్ పై ఇష్టం వచ్చినట్టుగా పవన్ చేస్తున్న విమర్శలను జనసైనికులు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఇక జనం ఆయన ఆరోపణల్ని పెద్దగా పట్టించుకుంటారనుకోవడం అపోహే అవుతుంది. వాలంటీర్లపై నిందారోపణలు, అమ్మాయిల మిస్సింగ్ కేసులపై ఊహాతీత లెక్కలు.. ఇలా పవన్ నోటికొచ్చిందేదో చెప్పేస్తున్నారు. ఆ తర్వాత వాటికి వివరణ ఇచ్చుకోడానికి వెనకడుగు వేస్తున్నారు.

ఇలా అయితే ఎలా..?

చంద్రబాబు జైలులో ఉన్నారు, లోకేష్ బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి. టీడీపీకి దిక్కులేదు, ఆ బాధ్యత కూడా భుజానికెత్తుకుని ఇప్పుడు పవన్ కల్యాణ్ యాత్రలు చేస్తున్నారు. ఈ యాత్రల్లో ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ తనకు తానే రెండు పార్టీల పరువు తీస్తున్నారు. 1920 నుంచీ తనకు జగన్ తెలుసు అన్న పవన్ మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

 

Tags:    
Advertisement

Similar News