జగ్గూభాయ్ అనే వెటకారం వెనక పవన్ వ్యూహం..

వాలంటీర్లపై పవన్ వి తప్పుడు ఆరోపణలు అని దాదాపుగా తేలిపోయింది. ఈ దశలో ఆ వ్యతిరేకతను తప్పించుకోడానికి సీఎం జగన్ ని సీన్ లోకి తీసుకొచ్చారు జనసేనాని. జగన్ ని దారుణంగా విమర్శిస్తూ టాపిక్ డైవర్ట్ చేశారు.

Advertisement
Update:2023-07-15 10:50 IST

ఇటీవల వారాహి సభల్లో పవన్ కల్యాణ్.. జగ్గూ, జగ్గూభాయ్ అంటూ సీఎం జగన్ పేరుని వెటకారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి నేతను ఇలా అగౌరవంగా మాట్లాడటం కరెక్ట్ కాదని పవన్ కి తెలియదనుకోలేం. కానీ పవన్ వ్యూహాత్మకంగానే జగన్ పేరు తెరపైకి తెస్తున్నారు. ఒకరకంగా వాలంటీర్ల విషయంలో వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోడానికే పవన్, జగన్ ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.


వాలంటీర్ల విషయం పక్కకు..

తొలి రెండు సభల్లో వాలంటీర్లను టార్గెట్ చేస్తూ మాట్లాడిన పవన్.. తణుకు మీటింగ్ లో మాత్రం పూర్తిగా జగన్ పై ఫోకస్ పెట్టారు. నేరుగా జగన్ నే విమర్శించారు. ఒకరకంగా వైసీపీ నేతల్ని మరోసారి రెచ్చగొట్టారు. అటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అదే స్థాయిలో పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈసారి వాలంటీర్ల సబ్జెక్ట్ పక్కకు వెళ్లిపోయింది. పవన్, జగన్ కేంద్రంగానే మాటల తూటాలు పేలుతున్నాయి.

వాలంటీర్ల విషయంలో లేనిపోని నిందలు వేసి పెద్ద తప్పు చేశాననే విషయం పవన్ కల్యాణ్ కి కూడా అర్థమైంది. అందరు వాలంటీర్లను తాను అనలేదు అని పైకి చెప్పుకుంటున్నా.. విమర్శలు చేసేటప్పుడు మాత్రం ఆయన కొందరు అని చెప్పకపోవడం విశేషం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పవన్ పై వ్యతిరేకత వస్తోంది. వుమన్ ట్రాఫికింగ్ కి సంబంధించి పవన్ చెప్పిన గణాంకాలు కూడా పూర్తిగా తప్పని తేలిపోయింది. పవన్ చెవిలో రహస్యం చెప్పిన ఆ కేంద్ర నిఘా వర్గాలు ఏవి అనే విషయం కూడా ఇంకా తేలలేదు. దీంతో వాలంటీర్లపై పవన్ వి తప్పుడు ఆరోపణలు అనేది దాదాపుగా తేలిపోయింది. ఈ దశలో ఆ వ్యతిరేకతను తప్పించుకోడానికి సీఎం జగన్ ని సీన్ లోకి తీసుకొచ్చారు జనసేనాని. జగన్ ని దారుణంగా విమర్శిస్తూ టాపిక్ డైవర్ట్ చేశారు.

Tags:    
Advertisement

Similar News