జగన్‌ను సీఎం చేస్తే మాకేంటి..? - వైసీపీ అనుబంధ సంఘాల నేతల ప్రశ్న

అయితే ఇంతకాలం తమకు రాష్ట్రంలో ఎదురు లేదని భావించిన వైసీపీకి.. ఒక్కసారిగా ఎదురుగాలి వీయడంతో పార్టీ అధినాయకత్వం కాస్త ఉక్కిరి బిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Update:2023-03-27 18:11 IST

పట్టభద్రుల, ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో సీఎం జగన్ తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్టు వార్తలు వస్తున్నాయి. పైకి ప్రభుత్వ సలహాదారు సజ్జల గంభీరమైన ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. లోలోన మాత్రం మథనపడుతున్నట్టు సమాచారం. దీంతో వైసీపీ కోసం శ్రమించిన నేతలు, దిగువస్థాయి కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నట్టు అధినాయకత్వం కూడా గ్రహించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల విజయవాడలో వైసీపీ అనుబంధ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఆ మీటింగ్‌లను సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్వహిస్తున్నారు.

ఆ సమావేశాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు ఏమీ చేయలేకపోయింది నిజమేనని అంగీకరించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగన్ కు మరోసారి ముఖ్యమంత్రి చేస్తే.. కచ్చితంగా అందరినీ ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారట. అయితే కొందరు అనుబంధ సంఘాల నాయకులు చెవిరెడ్డిని కొన్ని విషయాలపై నేరుగా నిలదీసినట్టు తెలిసింది. తాము గతంలో ఎంతో శ్రమించి.. డబ్బు ఖర్చుపెట్టుకొని పార్టీ కోసం పనిచేశామని.. అయితే తమను ఏనాడూ గుర్తించలేదని వారు వాపోయినట్టు సమాచారం. ఇందుకు చెవిరెడ్డి కూడా స్పందించారని.. కచ్చితంగా వచ్చే ఎన్నికల తర్వాత మంచి భవిష్యత్ ఇస్తామని వారికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే ఇంతకాలం తమకు రాష్ట్రంలో ఎదురు లేదని భావించిన వైసీపీకి.. ఒక్కసారిగా ఎదురుగాలి వీయడంతో పార్టీ అధినాయకత్వం కాస్త ఉక్కిరి బిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో నిత్యం ఈ విషయంపైనే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలవాలి..? చంద్రబాబు నాయుడు వ్యూహాలను ఎలా తిప్పికొట్టాలి.. అనే విషయంపై సీఎం జగన్.. కొందరు ముఖ్యనేతలతో చర్చిస్తున్నట్టు సమాచారం. చంద్రబాబును తక్కువ అంచనా వేయొద్దని.. ఈ ఎన్నికల ఫలితాన్ని ఒక గుణపాఠంగా తీసుకొని.. కచ్చితంగా వ్యూహాలు రచించాలని భావిస్తున్నారట. మరి జగన్ భవిష్యత్ లో ఏం చేయబోతున్నారు..? ప్రజల్లో ఇప్పటికే ఉన్న వ్యతిరేకతను ఎలా తొలగించబోతున్నారన్నది కీలకంగా మారింది.

Tags:    
Advertisement

Similar News