నాలెడ్జ్‌ హబ్‌గా తయారవుతున్న ఏపీ

ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్‌ భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తామన్న సీఎం చంద్రబాబు

Advertisement
Update:2024-12-06 14:38 IST

ఏపీ నాలెడ్జ్‌ హబ్‌గా తయారవుతున్నదని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ, నాలెడ్జ్‌ ఎకానమీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారేనని తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్‌టెక్‌ ఇన్నోవేషన్‌ కాంక్లేవ్‌కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికపైనే చర్చ జరుగుతున్నది. దీంతో అనేక నూతన మార్పులు వస్తున్నాయి. జీవితంలో అది ఓ భాగంగా మారింది. భారత్‌లో ఆధార్‌ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయి. 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశాను. పీపీపీ పద్ధతిలో హైటెక్‌ సిటీని నిర్మించాం. ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో పనులు జరిగేవి. కొత్తగా పీ4 విధానం తీసుకొస్తున్నాం. ఇక నుంచి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్‌ భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తామన్నారు.

డీప్‌ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని సీఎం చెప్పారు. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారాయి. వాటితోనూ అన్ని పనులు చేసుకునే పరిస్థితికి వచ్చామని చెప్పారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదన్నారు. ఆహార ఉత్పత్తులు, సరఫరాలో గ్లోబల్‌ హబ్‌గా ఏపీ మారబోతున్నది. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నది. రాష్ట్రానికి ఉన్న వనరుల్లో అతఙక తీర ప్రాంతం ఒకటి. పెట్టుబడులతో వస్తున్న వారికి అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News