ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన కపిల్ దేవ్

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ సమావేశం అయ్యారు

Advertisement
Update:2024-10-29 17:34 IST

భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ నేడు ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. ఇవాళ విజయవాడ వచ్చిన కపిల్‌దేవ్ స్థానిక ఎంపీ, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు కేశినేని చిన్నితో కలిసి ఉండవల్లి తరలి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు. అమరావతిలో గోల్ఫ్ కోర్స్, క్లబ్ ఏర్పాటుపై చర్చించినట్టు సమాచారం. క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కపిల్ దేవ్... గోల్ఫ్ వైపు మళ్లారు. ప్రస్తుతం ఆయన ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా, ఏపీ రాజధాని అమరావతిలో గోల్ఫ్ మైదానం ఏర్పాటుకు ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. చంద్రబాబు అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలని కృషి చేస్తున్నారు.

ఈ క్రమంలో గోల్ఫ్ కోర్స్ కూడా అమరావతికి ఒక అదనపు ఆభరణం అవుతుందని భావిస్తున్నారు. ఏపీలో ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులకు చంద్రబాబు సూచించారు. వీలైతే 2027 జాతీయ క్రీడలు కూడా ఏపీలో నిర్వహించేలా సీం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కోసం కొత్త క్రీడా పాలసీని రూపొందించే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు. తాజాగా చంద్రబాబు కపిల్ దేవ్‌తో సమావేశంకావటంతో రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల ప్రోత్సాహం దిశగా అడుగులు పడినట్లేనని భావిస్తున్నారు. కాగా, గన్నవరం ఎయిర్ పోర్టులో కపిల్ దేవ్ కు ఎంపీ కేశినేని చిన్ని, తిరువూరు శాసన సభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికారు.

Tags:    
Advertisement

Similar News