రేషన్ కార్డుదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీలో రేషన్ కార్డు దారులకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్న తరుణంలో వారికి ఈ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.
రేషన్ కార్డు దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల నుంచి నిత్యావసరాల సరుకులు కందిపప్పు, చక్కెర ధరలు తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కాగా కిలో కంది పప్పు సబ్సిడీపై రూ.67 కి, 17 రూపాయలకే అరకేజీ చక్కెర పంపిణీ చేస్తామని తెనాలి నియోజకవర్గంలో రేషన్ పంపీణీలో మంత్రి నాదెండ్ల తెలిపారు.
నిత్యావసరాల ధరలు భారీన సందర్బంగా పేద ప్రజలు సతమతమవుతున్న వేళ కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.180 (కేజీ) అమ్ముతున్న కందిపప్పు ధరను ఒకే నెలలో రెండు సార్లు నియంత్రించి ఇప్పటికే 160 రూపాయలు, 150 రూపాయలకు తగ్గించి అందించిన ప్రభుత్వం ఇప్పుడు మరింత తగ్గించింది. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రంలో ఏకంగా 4.32 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని మంత్రి తెలిపారు