నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసిన ఏపీ ప్రభుత్వం

20 కార్పొరేషన్లలో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1

Advertisement
Update:2024-09-24 13:44 IST

ఏపీ ప్రభుత్వం నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్‌ హజీజ్‌, శాప్‌ ఛైర్మన్‌ రవి నాయుడు, గృహ నిర్మాణ బోర్డు ఛైర్మన్‌గా తాతయ్య బాబు, మార్క్‌ఫెడ్‌ ఛైర్మన్‌గా కర్రోతు బంగార్రాజు, సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా మన్యం సుబ్బారెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్‌గా లంకా దినకర్‌ నియమితులయ్యారు.20 కార్పొరేషన్లతో పాటు మొత్తం 99 నామినేటెడ్‌ పోస్టులు భర్తీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి కేటాయించింది.

సామాన్య కార్యకర్తలకు పెద్ద పీట

20 కార్పొరేషన్లు కు ఛైర్మెన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ ఛైర్మెన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది.99 మందితో మొదటి నామినేటెడ్ పదవుల లిస్ట్ నుప్రకటించింది. ఇందులో బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు పెద్ద పీట వేసింది. 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్ లకు పదవులు ఇవ్వగా.. ఒక క్లస్టర్ ఇంఛార్జ్ కు ఛైర్మెన్ పదవి కట్టబెట్టింది. ఆరుగురు యూనిట్ ఇంఛార్జ్ లకు పదవులు ఇచ్చింది.ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News