ఏపీలో కొత్త ఇసుక పాలసీ.. పాత అనుభవాలు గుర్తున్నాయా..?

గత ప్రభుత్వంలో ఇసుకను బ్లాక్ మార్కెట్ చేశారంటున్న మంత్రి రవీంద్ర.. ఇసుక మాఫియాతో సంబంధం ఉన్నవారిని వదిలిపెట్టేది లేదన్నారు.

Advertisement
Update: 2024-07-03 16:57 GMT

2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం ఇసుక విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. ఓ సారి డ్వాక్రా మహిళలకు ఇసుక అమ్మకాలు అప్పగించారు, మరోసారి ఇసుక పూర్తిగా ఉచితం అన్నారు. చివరకు అన్ని పాలసీలు విఫలమయ్యాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా ఇసు విధానంలో ప్రజల ఆగ్రహాన్ని చవిచూసింది. ఇసుక భారం కావడంతో నిర్మాణ రంగంపై దెబ్బపడింది. ఎన్నికల సమయంలో కూడా ఇసుక విధానంపై టీడీపీ తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. ఇక ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక ఇసుక విధానాన్ని మళ్లీ మార్చేశారు.


ఇసుక ఫ్రీ..

ఈ నెల 8 నుంచి కొత్త ఇసుక పాలసీ అమల్లోకి తీసుకొస్తోంది కూటమి ప్రభుత్వం. ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి తెరపైకి తేవాలని నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు ప్రజలకు ఇసుక ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రకు సీఎం ఆదేశాలిచ్చారు.

సీఎం ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానం అమలుకు విధి విధానాలు రూపొందించుకుంటున్నామని తెలిపారు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. వచ్చే మూడు నెలల్లో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఇసుక దోపిడీ జరిగిందని విమర్శించారు మంత్రి. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కడుపు కొట్టిందన్నారు. ఇకపై అలా జరగడానికి వీల్లేదని, ఇసుకను ఉచితంగా ప్రజల అవసరాలకు వినియోగించుకునేలా పాలసీ మారుస్తున్నట్టు తెలిపారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఉచిత ఇసుక విధానం అమలవుతుందన్నారు మంత్రి రవీంద్ర.

విచారణ చేపడతాం..

గత ప్రభుత్వంలో ఇసుకను బ్లాక్ మార్కెట్ చేశారంటున్న మంత్రి రవీంద్ర.. ఇసుక మాఫియాతో సంబంధం ఉన్నవారిని వదిలిపెట్టేది లేదన్నారు. గత ప్రభుత్వం అనధికారికంగా పెట్టిన స్టాక్ పాయింట్లను తిరిగి ప్రభుత్వం కంట్రోల్ లోకి తీసుకుంటామన్నారు రవీంద్ర. 

Tags:    
Advertisement

Similar News