ఏపీలో కూటమి మేనిఫెస్టో.. సమాధానం దాటవేసిన అమిత్ షా

కూటమి మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని అమిత్ షా.. జగన్ కి మోదీ ఫొటో ఎలా కనపడిందంటూ డొంక తిరుగుడుగా మాట్లాడి తప్పించుకున్నారు.

Advertisement
Update:2024-05-04 20:53 IST

ఏపీలో కూటమి మేనిఫెస్టోపై ప్రధాని మోదీ ఫొటో లేదు సరికదా, కనీసం కమలం పువ్వు గుర్తు కూడా లేదు. కూటమి మేనిఫెస్టోకి బీజేపీ సపోర్ట్ లేదనే విషయం ఇక్కడ స్పష్టమైంది. అయితే దీన్ని కవర్ చేసుకోడానికి టీడీపీ, ఎల్లో మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో జగన్ సహా వైసీపీ నేతలు మేనిఫెస్టో విషయంలో చంద్రబాబుని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఆ మేనిఫెస్టోలో మోదీ ఫొటో ఎందుకు లేదని అంటున్నారు. అంటే దానికి బీజేపీ మద్దతు లేదని ఒప్పుకున్నట్టేనా అంటున్నారు. మేనిఫెస్టో బయటకు వచ్చిన సమయంలో సీఎం జగన్ కూడా సెటైర్లు పేల్చారు. కూటమి మేనిఫెస్టో ప్రచారంలో ముందు మోదీ ఫొటో ఉందని, ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చాక, ఆ ఫొటో తీసేశారని అన్నారు. జగన్ కామెంట్లపై ఇప్పుడు అమిత్ షా స్పందించారు.


డొంక తిరుగుడు సమాధానం..

కూటమి మేనిఫెస్టో గురించి వివరించాలంటూ ఇటీవల అమిత్ షా కి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. అయితే ఆయన దానిపై నేరుగా స్పందించలేదు. కూటమి మేనిఫెస్టోకి బీజేపీ సపోర్ట్ ఉందా, లేదా అనే విషయాన్ని డైరెక్ట్ గా చెప్పలేదు. అదే సమయయంలో ఆయన జగన్ వ్యాఖ్యలపై మాత్రం స్పందించారు. కూటమి మేనిఫెస్టోపై మోదీ ఫొటో ముందుగా ప్రింట్ చేశారా లేదా అనేది జగన్ కి ఎలా తెలుసని లాజిక్ తీశారు అమిత్ షా.

ఆ విషయం చెప్పండి చాలు..

కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని నేరుగానే చెబుతున్నారు అమిత్ షా. మరి ఏపీలో సంగతేంటి..? ఏపీలో కూటమి తరపున చంద్రబాబు రిజర్వేషన్ల గురించి నాటకాలాడుతున్నారు. ముస్లింల 4 శాతం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో మంచి లాయర్లను పెట్టి వాదించేలా చూస్తామంటున్నారు. అంతే కానీ, రిజర్వేషన్లకు తాము అనుకూలం అని మాత్రం చెప్పలేకపోతున్నారు. చంద్రబాబు అసలు రిజర్వేషన్లకు అనుకూలమా, లేక ఎన్డీఏ కూటమి సిద్ధాంతాల ప్రకారం రిజర్వేషన్లు తీసేస్తారా..? అని సీఎం జగన్ సూటిగా ప్రశ్నిస్తున్నారు. దీంతో అటు చంద్రబాబు, ఇటు బీజేపీ కూడా డైలమాలో పడ్డాయి. కూటమి మేనిఫెస్టోకి బీజేపీ మద్దతు ఉందా లేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేని అమిత్ షా.. జగన్ కి మోదీ ఫొటో ఎలా కనపడిందంటూ డొంక తిరుగుడుగా మాట్లాడి తప్పించుకున్నారు. 

Tags:    
Advertisement

Similar News