భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూస్తాం.. - నవీన్ జిందాల్

ఏపీలోని కృష్ణ‌ప‌ట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ ఈ సంద‌ర్భంగా సుముఖత వ్యక్తం చేశారు.

Advertisement
Update:2023-03-03 13:36 IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని భ‌విష్య‌త్తులో గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూస్తామ‌ని జిందాల్ స్టీల్ అండ్ ప‌వ‌ర్ లిమిటెడ్ చైర్మ‌న్‌ నవీన్ జిందాల్ తెలిపారు. విశాఖ‌ప‌ట్నంలో శుక్ర‌వారం ప్రారంభించిన గ్లోబ‌ల్ ఇన్వెస్ట‌ర్స్ స‌మ్మిట్ - 2023లో న‌వీన్ జిందాల్ మాట్లాడుతూ.. గ‌త అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌తో త‌మ‌కు ఉన్న సానుకూల అనుభవాన్ని పంచుకోవడానికి తాము సంతోషిస్తున్నామ‌ని చెప్పారు.

అద్భుతమైన మౌలిక సదుపాయాలు, భారీ తయారీ స్థావరం, ప్రతిభావంతులైన యువత, అద్భుతమైన వ్యాపార అనుకూల వాతావరణం ఏపీలో ఉన్న‌ట్టు ఆయ‌న తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం దూర‌దృష్టితో చేపడుతున్న విధానాల‌ను అభినందించారు.

ఏపీలోని కృష్ణ‌ప‌ట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ ఈ సంద‌ర్భంగా సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకోసం రూ.10 వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్టు ఆయ‌న‌ తెలిపారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని జిందాల్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News