40 రోజులు, 22 కేసులు.. యువగళం ట్రాక్ రికార్డ్

నారా లోకేష్ యాత్ర ఎన్నోరోజు అనే ఎంక్వయిరీకంటే ఎన్నో కేసు అనే వ్యవహారమే ఆసక్తిగా మారిదిం. 40రోజుల యాత్రకు సంబంధించి 76మంది టీడీపీ నేతలపై 22 కేసులు పెట్టారు పోలీసులు. ఇందులో లోకేష్, అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు.

Advertisement
Update:2023-03-11 14:30 IST

నారా లోకేష్ యువగళం పాదయాత్ర 40రోజులు పూర్తి చేసుకుంది. ఈ 40రోజుల్లో లోకేష్ సాధించిన పురోగతి ఏంటో చెప్పాలంటే టీడీపీ నేతలు కూడా ఆలోచించాల్సిందే. అయితే ఇటీవల సవాళ్లు, ప్రతిసవాళ్లతో యువగళం టాక్ ఆఫ్ చిత్తూరు జిల్లాగా మారింది. అయితే ఓ విషయంలో మాత్రం యువగళం ట్రాక్ రికార్డ్ నెలకొల్పింది. యాత్రకు సంబంధంచి ఇప్పటి వరకు టీడీపీ నేతలపై పోలీసులు 22 కేసులు నమోదు చేశారు. అంటే దాదాపు 2 రోజులకొక కేసు పెట్టారన్నమాట.

నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనవరి 27వ తేదీన కుప్పం నుంచి ప్రారంభమైంది. తారకరత్న అంత్యక్రియల సందర్భంగా రెండురోజులపాటు యాత్రకు విరామం ఇచ్చారు లోకేష్. ఆ తర్వాత తిరిగి యాత్రను ప్రారంభించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మరోసారి యాత్రకు 2రోజులపాటు విరామం ప్రకటించారు. ఆదివారం, సోమవారం యాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేష్, మంగళవారం తంబళ్లపల్లెలో పర్యటిస్తారు.

తంబళ్లపల్లె కేంద్రంగా ఇప్పటికే మాటల తూటాలు బయటకొచ్చాయి. నీ ఊరొచ్చా, నీ వీధికొచ్చా అంటూ లోకేష్, ఎంపీ మిథున్ రెడ్డి కి సవాల్ విసిరారు. ప్లేస్ నువ్వు చెబుతావా, నన్ను చెప్పమంటావా, తంబళ్లపల్లెలోనే ఉంటా తేల్చుకుందామంటూ మిథున్ రెడ్డి ఘాటు రిప్లై ఇచ్చారు. ఈరోజు కూడా తంబళ్లపల్లెలో 41రోజు యాత్ర కొనసాగుతోంది. రేపు ఎల్లుండి విరామం తర్వాత మంగళవారం యాత్ర మరింత హాట్ హాట్ గా సాగుతుందని తెలుస్తోంది.

మొత్తమ్మీద నారా లోకేష్ యాత్ర ఎన్నోరోజు అనే ఎంక్వయిరీకంటే ఎన్నో కేసు అనే వ్యవహారమే ఆసక్తిగా మారిదిం. 40రోజుల యాత్రకు సంబంధించి 76మంది టీడీపీ నేతలపై 22 కేసులు పెట్టారు పోలీసులు. ఇందులో లోకేష్, అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో 13నియోజకవర్గాలను కవర్ చేసిన లోకేష్, దాదాపు 520 కిలోమీటర్లు నడిచారు. అన్నమయ్య జిల్లాలో ఎంట్రీ ఇచ్చిన లోకేష్ రెండు రోజుల విరామం తర్వాత మళ్లీ మంగళవారం రోడ్డెక్కుతారనమాట.

Tags:    
Advertisement

Similar News