మదర్ సెంటిమెంట్ ఇప్పుడెందుకు లోకేష్..!

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో జోష్ కనపడుతోంది. లోకేష్ పాదయాత్రపై ఒక్కసారిగా ఫోకస్ పెరిగింది. దీంతో సడన్ గా లోకేష్ మాటల్లో కూడా తేడా స్పష్టంగా కనపడుతోంది.

Advertisement
Update:2023-03-20 10:58 IST

నారా లోకేష్ యువగళం పాదయాత్ర 45రోజులు దాటిపోయింది. ఇన్నిరోజుల్లో ఆయన ఎప్పుడూ మదర్ సెంటిమెంట్ గుర్తు చేస్తూ డైలాగులు చెప్పలేదు. ఆ మాటకొస్తే అసెంబ్లీలో అప్పట్లో చంద్రబాబు ఏడ్చిన ఎపిసోడ్, సవాల్ విసిరిన ఎపిసోడ్ కూడా యువగళంలో గుర్తు చేసేలా ఎప్పుడూ లోకేష్ మాట్లాడలేదు. కానీ తొలిసారి లోకేష్ సవాళ్లతో విరుచుకుపడ్డారు. తన తల్లిని అవమానించిన వారిని రోడ్డుపై పరిగెత్తించి కొడతానన్నారు.


“ఎవరైతే నా తల్లిని అవమానించారో వారిని కట్ డ్రాయర్ తో ఊరేగిస్తా, తాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా తల్లి ఎప్పుడూ బయటకు రాలేదు, నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా నా తల్లి ఎప్పుడూ బయటకు రాలేదు. అలాంటి అమ్మని శాసన సభ సాక్షిగా అవమానించారు. ఒక తల్లి బాధ నాకు తెలుసు. సవాల్ విసురుతున్నా. నేను గెలిచిన తర్వాత, బాబుగారిని కుర్చీ ఎక్కించిన తర్వాత, వారికి తగిన గుణపాఠం చెప్పిన తర్వాతే ఈ లోకేష్ ఇంటికెళ్తాడు. ఏనాడూ జగన్ తల్లి గురించి, భార్య గురించి, ఇద్దరు కూతుళ్ల గురించి తాను మాట్లాడలేదని, అది తన సంస్కారం.” అంటూ చెప్పుకొచ్చారు లోకేష్.

ఇప్పుడే ఎందుకు..?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో జోష్ కనపడుతోంది. లోకేష్ పాదయాత్రపై ఒక్కసారిగా ఫోకస్ పెరిగింది. దీంతో సడన్ గా లోకేష్ మాటల్లో కూడా తేడా స్పష్టంగా కనపడుతోంది. సడన్ గా మదర్ సెంటిమెంట్ ని కూడా ఆయన తెరపైకి తెచ్చారు. తన తల్లిని అవమానించారు అంటూ మరోసారి ప్రస్తావించారు. మొత్తమ్మీద ఎమ్మెల్సీ ఫలితాలపై టీడీపీ దూకుడు పెంచిందనే చెప్పాలి. పనిలో పనిగా ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. 2024 ఎన్నికల నాటికి అజెండాలు, సెంటిమెంట్లు.. మరిన్ని బయటకు వచ్చే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News