ఎదురు చూపులు ఫలించాయి.. లోకేష్ ని కరుణించిన అమిత్ షా
రెండో రోజు సీఐడీ విచారణ తర్వాత హడావిడిగా నారా లోకేష్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అమిత్ షా తో ఆయనకు అపాయింట్ మెంట్ ఖరారు కావడంతోనే నేరుగా ఢిల్లీ వెళ్లారు లోకేష్. బుధవారం రాత్రి ఆలస్యంగా ఈ భేటీ జరిగింది.
ఎట్టకేలకు నారా లోకేష్ ఎదురు చూపులు ఫలించాయి. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో నారా లోకేష్ భేటీ అయ్యారు. తన కష్టాలన్నీ చెప్పుకున్నారు, జగన్ పై చెప్పాల్సినవన్నీ చెప్పారు. ఈ భేటీలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం విశేషం.
సీఎం జగన్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని నారా లోకేష్, అమిత్ షా కి ఫిర్యాదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ చేసి జైలులో పెట్టడమే కాకుండా, విచారణ పేరుతో తనని వేధిస్తున్నారని చెప్పారు. తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబుపై ఉన్న కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షా కి లోకేష్ వివరించారు. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని అమిత్ షా అభిప్రాయపడ్డారని టీడీపీ వర్గాలంటున్నాయి. చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆయన వాకబు చేశారంటున్నారు. కేసుల వివరాలను ఆయనే అడిగి తెలుసుకున్నారని చెబుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నానని లోకేష్ తో అమిత్ షా చెప్పినట్టు టీడీపీ వర్గాల సమాచారం.
రెండో రోజు సీఐడీ విచారణ తర్వాత నారా లోకేష్ హడావిడిగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అమిత్ షా తో ఆయనకు అపాయింట్ మెంట్ ఖరారు కావడంతోనే నేరుగా ఢిల్లీ వెళ్లారు లోకేష్. బుధవారం రాత్రి ఆలస్యంగా ఈ భేటీ జరిగింది. అప్పటికే ఢిల్లీలో ఉన్న కిషన్ రెడ్డి, పురందేశ్వరి కూడా భేటీలో పాల్గొనడం విశేషం. ఇన్నాళ్లూ లోకేష్ ఢిల్లీ వెళ్లి లాయర్లతో సమాలోచనలు జరుపుతున్నారంటూ టీడీపీ ఊదరగొట్టినా, ఆయన అసలు లక్ష్యం అమిత్ షా ను కలవడమే. అమిత్ షా ను కలిస్తే చంద్రబాబు కేసు వ్యవహారంలో అద్భుతాలు జరిగిపోవు, కానీ బీజేపీ తమవైపు ఉంది అని చెప్పుకోవడం టీడీపీకి అత్యవసరంగా మారింది. అందుకే లోకేష్ ఇన్నాళ్లు ఢిల్లీలో ఎదురు చూసి ఎట్టకేలకు అమిత్ షా ని కలిశారు.
♦