కొడాలి నానిపై నందమూరి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు

  • ఎవరు ఎవరిని మోసం చేశారో.. నాని ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుందన్నారు. టీడీపీని వాడుకున్న నాని.. నందమూరి కుటుంబాన్ని మోసం చేశారన్నారు.

Advertisement
Update:2023-04-13 13:02 IST

మాజీ మంత్రి కొడాలి నాని ఎప్పుడు విమర్శలు చేసినా ఆయన టార్గెట్ చంద్రబాబు, లోకేష్ మాత్రమే. నందమూరి కుటుంబంపై ఆయన సింపతీ చూపిస్తారు కానీ, నేరుగా విమర్శలు చేయడం తక్కువ. చంద్రబాబు బాధితులు నందమూరి వారసులు అని చెబుతుంటారు కొడాలి నాని. చంద్రబాబు, లోకేష్ కూడా ఎప్పుడూ కొడాలి నానికి గట్టిగా కౌంటర్లిచ్చిన సందర్భాలు లేవు. తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ.. కొడాలి నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి వంశమేనని గుర్తుంచుకోవాలన్నారు.

ఎన్టీఆర్‌ శత జయంతి మహోత్సవాల్లో భాగంగా ఆయన స్వగ్రామం కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరు వచ్చారు నందమూరి రామకృష్ణ. మీడియాతో మాట్లాడిన ఆయన కొడాలి నానిపై ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు చంద్రబాబు అన్యాయం చేశారంటున్న కొడాలి నాని ఆరోపణలు అవాస్తవం అన్నారు. ఎవరు ఎవరిని మోసం చేశారో నాని ఆత్మసాక్షిని అడిగితే తెలుస్తుందన్నారు. టీడీపీని వాడుకున్న నాని.. నందమూరి కుటుంబాన్ని మోసం చేశారన్నారు.

కొడాలి వర్సెస్ నందమూరి..

గుడివాడలో కొడాలి నానిపై గతంలో తారకరత్న పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. తారకరత్న అకాల మరణం తర్వాత, అక్కడ అభ్యర్థి కోసం చంద్రబాబు వెదుకులాట మొదలు పెట్టారు. ఇప్పుడు సడన్ గా నందమూరి ఫ్యామిలీ మళ్లీ తెరపైకి వచ్చింది. రామకృష్ణతోపాటు హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా నిమ్మకూరుకి వచ్చారు. నిమ్మకూరు రావడం చాలా ఆనందంగా ఉందని, ఆడపడుచు వచ్చిందని అందరూ గౌరవిస్తున్నారన్నారు సుహాసిని. గుడివాడలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరైనా బరిలో నిలుస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. 

Tags:    
Advertisement

Similar News