మళ్లీ నెటిజన్లకు దొరికిపోయిన నాగబాబు

ఈవీఎం మిషన్లను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద జనసేన నాయకులు పహారా కాయాలని సూచించారు నాగబాబు.

Advertisement
Update:2024-05-18 21:56 IST

అల్లు అర్జున్ పై పరోక్ష ట్వీట్ వేసి, బన్నీ ఫ్యాన్స్ కి అడ్డంగా బుక్కయిన నాగబాబు రెండు రోజులపాటు తన అకౌంట్ ని సస్పెండ్ చేసుకుని సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత ఆ ట్వీట్ డిలీట్ చేసి తిరిగి ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. కాసేపటి తర్వాత ఆయన ఓ వీడియో మెసేజ్ విడుదల చేశారు. జనసేన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో ఆ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు మరింత దారుణంగా నాగబాబుని ట్రోల్ చేయడం విశేషం.


ఇంతకీ నాగబాబు ఏమన్నారు..?

జనసేన నాయకులకు తన సందేశం అంటూ నాగబాబు విడుదల చేసిన వీడియోలో సీఎం జగన్ పై తనకున్న అక్కసునంతా బయటపెట్టారు. కౌంటింగ్ ముగిసి కూటమి విజయం ఖాయమైన తర్వాత కూడా జగన్ తన కుర్చీ వదలనని అంటారని చెప్పుకొచ్చారు నాగబాబు. ఫలితాల తర్వాత అల్లర్లు సృష్టించేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని, వారిని ఎదుర్కోవాలని జనసైనికులకు పిలుపునిచ్చారు.

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పహారా..

ఈవీఎం మిషన్లను భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద జనసేన నాయకులు పహారా కాయాలని సూచించారు నాగబాబు. ఇప్పటి వరకూ ఏ నాయకుడూ ఇలాంటి సందేశాలివ్వలేదని, ఫస్ట్ టైమ్ నాగబాబు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పార్టీ నేతల్ని కాపలాగా ఉండాలంటున్నారని, ఇదెక్కడి చోద్యమంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతే కాదు సీఎం జగన్ ని స్పైడర్ సినిమాలో విలన్ తో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో పోల్చిన నాగబాబుపై మరింత దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. పిఠాపురంలో పవన్ ఓటమి ఖాయమని, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అన్నాదమ్ముళ్లు ఏం చేస్తారో చూస్తామని అంటున్నారు.

డైవర్షన్ గేమ్..

అల్లు అర్జున్ పై ట్వీట్ జారిన నాగబాబు.. చివరకు ఆ ట్వీట్ డిలీట్ చేసి తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు సీఎం జగన్ పై ఘాటు కామెంట్లు చేసి వ్యవహారాన్ని అటువైపు డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేశారు. వైసీపీ నేతల్ని రెచ్చగొట్టి, కాసేపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని సైలెంట్ చేద్దామనుకున్నారు. అయినా నాగబాబుని ఎవరూ వదిలిపెట్టట్లేదు. ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News