మీడియా రంగంలోకి నాగబాబు

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు శాటిలైట్‌, యూ ట్యూబ్ ఛానల్స్‌ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం లెక్కలేనన్ని యూట్యూబ్‌ ఛానల్స్ పుట్టుకురాగా.. న్యూస్‌ ఛానల్స్‌ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి.

Advertisement
Update:2024-08-10 09:19 IST

మెగా బ్రదర్‌ కొణిదెల నాగబాబు మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. N మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను కొనేశారు. రెండు రోజుల క్రితం ఈ ఛానల్‌కు సంబంధించిన లోగో ఆవిష్కరణ కూడా జరిగిపోయింది. ఈ ఛానల్‌కు ప్రస్తుతం 1 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌కే పరిమితమవుతారని, భవిష్యత్తులో పొలిటికల్‌ న్యూస్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది. నాగబాబు మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.




 ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో బోలెడు శాటిలైట్‌, యూ ట్యూబ్ ఛానల్స్‌ ఉన్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం లెక్కలేనన్ని యూట్యూబ్‌ ఛానల్స్ పుట్టుకురాగా.. న్యూస్‌ ఛానల్స్‌ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మీడియా రంగంలోకి నాగబాబు రావాలనుకోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉందంటున్నారు విశ్లేషకులు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆయన టార్గెట్ కాదని.. న్యూస్‌ మాత్రమేనని చెప్తున్నారు.

జనసేనకు మద్దతుగా రెండు ఛానల్స్ ఉన్నాయి. జనసేన కూడా కూటమి ప్రభుత్వంలో ఉండడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే ఛాన్సే లేదు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక సాక్షి మినహా మరే ఛానల్‌ వ్యతిరేకంగా వార్తలు ప్రసారం చేసే పరిస్థితి లేదు. కానీ, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికీ తెలియదు. అందుకనే దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న చందంగా.. అధికారంలో ఉండగానే నాగబాబు అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారని టాక్‌. నాగబాబు మీడియా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనసేన అభిమానులు సంబరపడిపోతున్నారు. తమకంటూ సొంతంగా ఓ ఛానల్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News