టీటీడీ చైర్మన్ గా నాగబాబు.. క్లారిటీ ఇచ్చిన మెగా బ్రదర్

ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని ప్రజలను కోరారు. పార్టీ అధికారిక హ్యాండిల్స్ లేదా తన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లో నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.

Advertisement
Update:2024-06-06 20:29 IST

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కూటమిలో ఉన్న జనసేన పార్టీ కూడా పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో ఘన విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో మొదటినుంచి చివరి వరకు తమ్ముడికి అండగా నిలబడిన పవన్ రెండో అన్నయ్య నాగబాబు టీటీడీ చైర్మన్ గా నియమితులు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రచారంపై తాజాగా నాగబాబు స్పందించారు. ట్విట్టర్ వేదికగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను టీటీడీ చైర్మన్ గా నియమితులు కానున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. అది ఫేక్ న్యూస్ అని కొట్టి పారేశారు.


ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మవద్దని ప్రజలను కోరారు. పార్టీ అధికారిక హ్యాండిల్స్ లేదా తన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లో నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు. తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని మీడియాను నాగబాబు కోరారు.

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. అనకాపల్లి నుంచి జనసేన తరపున ఎంపీగా పోటీ చేయాలని భావించినప్పటికీ బీజేపీ పొత్తులోకి రావడంతో తన సీటును త్యాగం చేశారు. అప్పుడే కూటమి అధికారంలోకి వస్తే నాగబాబుకు ఏదో ఒక పదవి కట్టబెడతారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆయన టీటీడీ చైర్మన్ గా త్వరలో ప్రమాణం చేయనున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తాజాగా నాగబాబు ఫేక్ న్యూస్ గా తేల్చేశారు.

Tags:    
Advertisement

Similar News