15 ఏళ్ల తర్వాత ముద్రగడ పొలిటికల్ రీ-ఎంట్రీ
కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ముద్రగడతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని వైసీపీ ప్లాన్ చేసింది.
Advertisement
కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం పొలిటికల్ రీఎంట్రీ కన్ఫామ్ అయింది. ఈనెల 14న ఆయన వైసీపీ అధినేత జగన్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కొడుకు గిరి కూడా వైసీపీలో చేరనున్నారు.
దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు ముద్రగడ. చివరిసారి 2009లో పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానానికి పరిమితమయ్యారు. జనతా పార్టీతో రాజకీయ ప్రవేశం చేసిన ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఓ సారి ఎంపీగా గెలుపొందారు.
ఇక కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ముద్రగడతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని వైసీపీ ప్లాన్ చేసింది. ఆయన కొడుకు గిరికి నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Advertisement