బూతులతో తిట్టించే బదులు చంపేయండి..

తాను చేతకాని వాడిని, అసమర్థుడిని కాబట్టి పవన్ కల్యాణ్ ను కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయాలని కోరినట్టు తెలిపారు ముద్రగడ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలన్నారు.

Advertisement
Update:2024-06-21 15:35 IST

ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న తర్వాత తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన మాజీ మంత్రి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ప్రజలతో తనను, తన కుటుంబాన్ని బూతులు తిట్టిస్తున్నారని, దాని బదులు తమ కుటుంబాన్ని చంపేయాలని కోరారు. మొత్తం తమ కుటుంబంలో ఏడుగురు ఉన్నారని, అందర్నీ చంపేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ముద్రగడ. సవాల్ కి కట్టుబడి ఉన్నాను కాబట్టే తన పేరు మార్చుకున్నానని చెప్పారాయన.

అసమర్థుడిని, చేతకాని వాడిని..

తాను చేతకాని వాడిని, అసమర్థుడిని కాబట్టి పవన్ కల్యాణ్ ను కాపు రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేయాలని కోరినట్టు తెలిపారు ముద్రగడ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ చేతుల్లో ఉన్నాయి కాబట్టి కాపులకు రిజర్వేషన్ సాధించాలన్నారు. ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడాలి అని గుర్తు చేశారు.

సినిమాలు ఆపెయ్ పవన్..

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు వదిలేశారని, పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు వదిలేసి ప్రజాసేవ చేయాలని కోరారు ముద్రగడ. వైసీపీ సానుభూతిపరుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, వెంటే వాటిని ఆపేయాలన్నారు. అమావాస్య తర్వాత పౌర్ణమి కూడా వస్తుందని హెచ్చరించారు.

కాపు రిజర్వేషన్లకోసం పోరాడే సమయంలో ముద్రగడపై ఆ సామాజిక వర్గంలో సానుభూతి ఉండేది. ఇటీవలి ఎన్నికల్లో ఆ సామాజిక వర్గమంతా పవన్ వెంట నడిచినట్టు ఫలితాలతో స్పష్టమైంది. పవన్ ని వ్యతిరేకించిన ముద్రగడ సహజంగానే సొంత సామాజిక వర్గం ఆగ్రహానికి గురవుతున్నారు. పేరు మార్చుకుని ఆయన సాధించించేంటి..? తిరిగి కాపులు ముద్రగడను అక్కున చేర్చుకుంటారా..? అనేది వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News