కుప్పం వైసీపీ అభ్యర్థిగా భరత్.. బ్యాక్‌గ్రౌండ్ ఇదే.!
భరత్.. మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కుమారుడు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాలు గెలవడంలో భరత్ కీ రోల్ ప్లే చేశారు.
కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించాలని భావిస్తున్న జగన్.. యువకుడిని బరిలో నిలిపారు. కుప్పం వైసీపీ అభ్యర్థిని ప్రకటించారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. ఎమ్మెల్సీ భరత్‌ను కుప్పం అభ్యర్థిగా ప్రకటించారు. గత ఎన్నికల్లో భరత్ తండ్రి చంద్రమౌళి గెలవకపోయినప్పటికీ.. భరత్‌ను ఎమ్మెల్సీని చేసి కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమించారు జగన్.
భరత్‌ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. మంత్రి వర్గంలో చోటిచ్చి గుండెల్లో పెట్టుకుంటానన్నారు జగన్. తద్వారా కుప్పం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని, సంక్షేమాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు అనేక ప్రశ్నలు సంధించారు జగన్. దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. సొంత నియోజకవర్గాన్ని చంద్రబాబు అభివృద్ధి చేయలేకపోయారన్నారు జగన్.
భరత్.. మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కుమారుడు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని మెజార్టీ స్థానాలు గెలవడంలో భరత్ కీ రోల్ ప్లే చేశారు. 2014, 2019 ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ తండ్రి చంద్రమౌళి.. వరుసగా 55 వేలు, 70 వేల ఓట్లు సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా ఏడుసార్లు విజయం సాధించారు. ఎనిమిదో సారి కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయబోతున్నారు. అయితే గత ఎన్నికల్లో చంద్రబాబు భారీగా మెజార్టీ తగ్గడం, ఆయనపై వ్యతిరేకత పెరగడం వైసీపీకి సానుకూల అంశాలు.