మంత్రి రోజా కన్నీటి పర్యంతం.. - వీడియో వైరల్

గతంలో ఆమె పుట్టిన రోజు సందర్భంగా తన అన్నకు ముద్దుపెడుతున్న ఓ వీడియోను తీసుకొని.. దాన్ని దురర్థం వచ్చేలా.. కొన్ని సినిమా మాటలు యాడ్ చేసి ట్రోల్ చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది.

Advertisement
Update:2022-12-22 14:34 IST

మంత్రి రోజా కన్నీటి పర్యంతం.. - వీడియో వైరల్

ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా.. పొలిటికల్ హాట్ కామెంట్లు చేయడంలో ఎప్పుడూ ముందుంటారనే విషయం తెలిసిందే. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రత్యర్థులపై తుటాల్లాంటి మాటలు పేల్చడం ఆమెకు అలవాటే. అయితే అటువంటి నేతలకు సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ కూడా ఎక్కువే ఉంటాయి. మంత్రి రోజా విషయంలోనూ అదే జరిగింది. ఆమె నిత్యం పవన్ కల్యాణ్ పై, జనసేనపై ఆరోపణలు చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో జనసైనికులు ఆమె పాత వీడియోను ట్రోల్ చేశారు.

గతంలో ఆమె పుట్టిన రోజు సందర్భంగా తన అన్నకు ముద్దుపెడుతున్న ఓ వీడియోను తీసుకొని.. దాన్ని దురర్థం వచ్చేలా.. కొన్ని సినిమా మాటలు యాడ్ చేసి ట్రోల్ చేశారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ఉన్నది రోజా అన్న అంటూ కొంతమంది కామెంట్లు పెట్టినా ట్రోలింగ్ ఆగలేదు. కాగా తాజాగా ఈ ఘటనపై రోజా ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

తన అన్నతో సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసుకొని ఇటువంటి ట్రోలింగ్ చేయడం బాధాకరమని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం రోజా వీడియో వైరల్ అవుతోంది. నిత్యం సోషల్ మీడియాలో ఇటువంటి అరాచకం సాగుతున్న విషయం తెలిసిందే. సెలబ్రిటీలపై కొందరు ప్రత్యర్థులు నిజానిజాలు తెలుసుకోకుండా దారుణంగా వీడియోలు చేస్తున్నారు. కామెడీ వరకూ ఓకే గానీ.. శృతి మించి వ్యక్తిగత జీవితాల మీద వీడియోలు చేస్తుండటం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News