ఏపీలో ఫ్రీ బస్సు స్కీమ్‌.. తాజా అప్‌డేట్‌ ఏంటంటే..?

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్‌ పేరుతో అమల్లో ఉంది. ఆధార్ కార్డు ప్రామాణికంగా ఈ స్కీమ్‌ను రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు.

Advertisement
Update: 2024-06-30 14:31 GMT

ఏపీలో అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే అంశంపై ఓ ప్రకటన చేశారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. విశాఖపట్నంలో పర్యటించిన ఆయన కొద్దిగా ఆలస్యమైనా స్కీమ్‌ను అమల్లోకి తీసుకువస్తామన్నారు. విశాఖపట్నం నుంచే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం స్కీమ్‌ ప్రారంభిస్తామన్నారు. ఈ స్కీమ్‌ అమలు విధివిధానాలపై తెలంగాణ, కర్ణాటకలో అధ్యయనం చేస్తామన్నారు మంత్రి మండిపల్లి.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి స్కీమ్‌ పేరుతో అమల్లో ఉంది. ఆధార్ కార్డు ప్రామాణికంగా ఈ స్కీమ్‌ను రెండు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు. తెలంగాణలో పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మాత్రమే మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఆధార్‌ కార్డు ఉంటే రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందులో భాగంగా మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తారు. తెలంగాణలో డీల‌క్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు.

అయితే తెలంగాణ, కర్ణాటకలోనూ ఈ పథకంపై విమర్శలు వస్తున్నాయి. సరిపడా బస్సులు వేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఏపీలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై ఎలాంటి నిబంధనలు పెడతారనేది ఆసక్తిగా మారింది.

Tags:    
Advertisement

Similar News