ముంద‌స్తు ఆలోచ‌న వైసీపీకి లేదు.. - మంత్రి పెద్దిరెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ‌

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక్షేమ‌, అభివృద్ధి పాల‌న‌తో ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయిన విష‌యాన్ని గుర్తించిన చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటమి తప్పదని అర్థ‌మైంద‌ని చెప్పారు.

Advertisement
Update:2023-06-05 17:35 IST

ముంద‌స్తు ఆలోచ‌న వైసీపీకి లేదు.. - మంత్రి పెద్దిరెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ‌

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ఆలోచన వైసీపీకి లేద‌ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. తాడేపల్లిలో సోమ‌వారం ఆయ‌న విలేక‌రులతో మాట్లాడారు. ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై ఊహాగానాలు వ‌స్తున్నాయంటూ ప‌లువురు ప్ర‌శ్నించ‌గా ఆయ‌న పైవిధంగా స‌మాధాన‌మిచ్చారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జ‌రుగుతాయ‌ని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. త‌మ పార్టీ బ‌లంగా ఉంద‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల ఆశీర్వాదాలు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి సంక్షేమ పాల‌న‌తో తామే అధికారంలోకి వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ‌కు వేరే పార్టీల‌తో పొత్తు యోచన లేద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా సంక్షేమ‌, అభివృద్ధి పాల‌న‌తో ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయిన విష‌యాన్ని గుర్తించిన చంద్ర‌బాబుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీకి ఓటమి తప్పదని అర్థ‌మైంద‌ని చెప్పారు. అందుకే ఆయ‌న వేరే పార్టీలపై ఆధార‌ప‌డుతున్నార‌ని తెలిపారు. జ‌నసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి తానేమీ మాట్లాడనని ఈ సంద‌ర్భంగా మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News