పట్టేశారు, పట్టేశారు.. మంత్రి నాదెండ్లకు ఎలివేషన్ ఇచ్చేశారు
కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏదో మార్పు తెస్తోంది అంటూ జనంలో చర్చ జరగాలి. హామీల అమలు ఆలస్యమైనా.. ఏదో జరుగుతోందనే భ్రమలో ప్రజల్ని ఉంచాలి.
చంద్రబాబు అధికారంలోకి వస్తే ఎలాంటి మార్పులు కనపడతాయో, వినపడతాయో.. సరిగ్గా ఇప్పుడు అన్నీ అలానే జరుగుతున్నాయి. ఆకస్మిక తనిఖీలు, తప్పుల్ని వెదికి పట్టుకోడాలు, అధికారులపై ఆగ్రహాలు.. ఏవీ లెక్కతప్పడంలేదు. అయితే ఈసారి జనసేన మంత్రులకు కూడా తగ్గేది లేదంటూ ఎలివేషన్లు ఇస్తున్నారు. తాజాగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్.. ఆ శాఖలో 200 కోట్ల రూపాయలకు పైగా కుంభకోణాన్ని కనిపెట్టారని ఎల్లో మీడియా కథనం ఇచ్చింది.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాదెండ్ల మనోహర్ తన నియోజకవర్గంలో తెనాలిలో ఆసక్మికంగా పర్యటించారు. దగ్గరుండి డ్రైనేజీలను క్లీన్ చేయించారు. పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన నేరుగా గోదాముల తనిఖీకి వెళ్లారు. తెనాలిలో తనిఖీలు చేస్తుండగా రేషన్ సరకులు, అంగన్వాడీ కేంద్రాలకు ఇచ్చే సరకుల తూకంలో తేడా ఉన్నట్టు ఆయన గుర్తించారు. ప్రతి ప్యాకెట్ కి 50నుంచి 100 గ్రాములు నొక్కేస్తున్నారని తేల్చారు. మరో చోటకూడా ఇలాగే తనిఖీ చేసి నిర్థారించుకున్న తర్వాత ఇది అతి పెద్ద కుంభకోణం అని ఆయన ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు.
ప్రక్షాళణ..!
కూటమి ప్రభుత్వం వచ్చింది, ఏదో మార్పు తెస్తోంది అంటూ జనంలో చర్చ జరగాలి. హామీల అమలు ఆలస్యమైనా.. ఏదో జరుగుతోందనే భ్రమలో ప్రజల్ని ఉంచాలి. అందుకు మీడియా అండదండలు పుష్కలంగా ఉండాలి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అదే పని చేస్తున్నారు. రోజుకో కొత్త వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారు. ఇప్పుడు మంత్రి నాదెండ్ల మనోహర్ ద్వారా పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణం వెలికితీసినట్టు ఎలివేషన్ ఇచ్చుకున్నారు. పౌరసరఫరాల శాఖను ప్రక్షాళణ చేస్తామని భారీ డైలాగులు కొడుతున్నారు. పనిలో పనిగా గత ప్రభుత్వంపై కావాల్సినంత బురదజల్లేశారు.