పవన్ ఫ్యాన్స్ మనుషులు కాదు, తోక ఒక్కటే తక్కువ..
పవన్ కల్యాణ్ అభిమానులు అసలు మనుషులే కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి తోక ఒక్కటే తక్కువని ఎగతాళి చేశారు.
పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విశాఖ గర్జన దగ్గర్నుంచి ఇరు వర్గాల కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో ఏపీ రాజకీయం వేడెక్కింది. మంత్రులంతా పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అటు పవన్ ఫ్యాన్స్ కూడా అంతే ఘాటుగా బదులిస్తున్నారు. వైసీపీ నేతలకు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా పవన్ ఫ్యాన్స్ ని మరోసారి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
పవన్ కల్యాణ్ అభిమానులు అసలు మనుషులే కాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కి తోక ఒక్కటే తక్కువని ఎగతాళి చేశారు. పవన్ ఫ్యాన్స్ ఆయన్నే కారుపై నుంచి తోసేశారని గుర్తు చేశారు. ఉన్మాదుల్లా ప్రవర్తిస్తారని, ఇప్పుడు వైసీపీ నేతలపై కూడా ఆ ఉన్మాదంతోనే దాడి చేశారని విమర్శించారు మంత్రి.
విశాఖ ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడిలో మంత్రి రోజాకు తల పగిలేదని, తృటిలో ప్రమాదం తప్పిందని అన్నారు మంత్రి కారుమూరి. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, లా అండ్ ఆర్డర్ సమస్య లేకుండా పోలీసులు చూడాలన్నారు. పవన్ తన మనుషుల్ని కంట్రల్ చేసుకోవాలని హితవు పలికారు. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తే, లా అండ్ ఆర్డర్ చూడొద్దని అంటారా..? అని ప్రశ్నించారు కారుమూరి.
రోజా గాజు గీసుకుందేమో.. ?
మరోవైపు విశాఖలో మంత్రులపై దాడి చేసింది జనసైనికులు కాదని అంటున్నారు ఆ పార్టీ నేతలు. మంత్రి రోజా చేయి చూపిస్తూ జనసైనికుల్ని రెచ్చగొట్టారని మండిపడ్డారు జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్. ఆమె చేతి గాజు గీసుకుని పక్కనున్న వ్యక్తి తలకు గాయమైందేమోనని అన్నారు. జనసేన నేతలు కట్టుతప్పలేదని చెప్పారు.