పవన్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారే..! వ్యవసాయశాఖ మంత్రి కాకాణి

పవన్ కల్యాణ్‌కు ప్రజల్లో ఎటువంటి విశ్వసనీయత లేదని.. అందుకే రెండు చోట్లా ప్రజలు ఓడించారని పేర్కొన్నారు. పవన్‌ పొలిటికల్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.

Advertisement
Update:2022-10-18 15:41 IST

జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ మంగళగిరిలో మాటల తూటాలు పేల్చిన విషయం తెలిసిందే. వైసీపీ నేతలపై తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రులను టార్గెట్ చేశారు.. 'చెప్పుతో కొడతా'.. 'నా కొడాక' అంటూ రెచ్చిపోయారు. తనను ఇంకోసారి ప్యాకేజీ స్టార్ అంటే ఊరుకోనని ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే పవన్ విమర్శలపై అప్పుడే కౌంటర్లు మొదలయ్యాయి. తాజాగా వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనంటూ విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఆయన పనిచేస్తున్నారని ఆరోపించారు.

టీవల చంద్రబాబుతో సావాసం చేసి పవన్ కల్యాణ్‌కు మతి మరుపు వచ్చినట్టుందని చురకలు అంటించారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్‌కు ప్రజల్లో ఎటువంటి విశ్వసనీయత లేదని.. అందుకే రెండు చోట్లా ప్రజలు ఓడించారని పేర్కొన్నారు. పవన్‌ పొలిటికల్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు.

పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో హీరో కావొచ్చు కానీ, రాజకీయాల్లో మాత్రం జీరో అని విమర్శించారు. గతంలో విశాఖలో పర్యటిస్తుంటే జగన్‌ను అడ్డుకున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలులో ఉంది కాబట్టే పవన్‌ స్వేచ్ఛగా తిరుగుతున్నాడన్నారు. చంద్రబాబుకి ఆయన సొంత పుత్రుడిపై నమ్మకం లేక.. దత్తపుత్రుడిని అడ్డం పెట్టుకొని లబ్ధిపొందాలని చూస్తున్నాడన్నారు.

2024లో కుప్పంలో కూడా చంద్రబాబుకి ఓటమి తప్పదన్నారు. చంద్రబాబు, పవన్‌ లాలూచీ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సంక్షేమ సారథి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ని విమర్శించే అర్హత పవన్‌కి లేదన్నారు. జగన్‌ ప్రభంజనానికి చంద్రబాబు అడ్రస్‌ గల్లంతైపోయిందన్నారు. రాజకీయ ఓనమాలు నేర్వని పవన్‌ కల్యాణ్‌ గాలికి కొట్టుకుపోతాడన్నారు.

Tags:    
Advertisement

Similar News