మీ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? మీడియా ప్రతినిధికి మంత్రి బొత్స ప్రశ్న

ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని ప్రధాని మోడీ చెప్పారు కదా.. అంటూ ఓ విలేక‌రి బొత్సను ప్రశ్నించారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలను తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? లేక ఇంగ్లిష్ మీడియంలోనా? అంటూ సూటిగా ప్రశ్నించారు.

Advertisement
Update:2022-11-01 18:40 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై ప్రత్యేక దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయంపై మొదటి నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అయినప్పటికీ సీఎం జగన్ వెనక్కి తగ్గలేదు. మరోవైపు నాడు - నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను బాగుచేస్తున్నారు. ఈ పథకం ఎంతో సత్ఫలితాలు ఇస్తోందని మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం చెప్పుకుంటోంది.

ఇదిలా ఉంటే ఇవాళ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో మీడియాతో మాట్లాడుతుండగా.. ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధించాలని ప్రధాని మోడీ చెప్పారు కదా.. అంటూ ఓ విలేక‌రి బొత్సను ప్రశ్నించారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పిల్లలను తెలుగు మీడియంలో చదివిస్తున్నారా? లేక ఇంగ్లిష్ మీడియంలోనా? అంటూ సూటిగా ప్రశ్నించారు. పేద ప్రజలకు నాణ్యమైన విద్య అందుతుంటే సహించలేరా? అంటూ ఫైర్ అయ్యారు. ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని.. ప్రధాని మోదీ పార్లమెంట్‌లో చట్టం చేశారా? అంటూ ప్రశ్నించారు. మొత్తంగా విలేకరుల సమావేశం హాట్‌హాట్‌గా మారింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను మొదటి నుంచి టీడీపీ, జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల్లో సైతం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వార్తలు వచ్చాయి. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం .. ఈ విషయంలో ధైర్యంగా ముందుకెళ్లారు. కింది తరగతి ప్రజల నుంచి ఇంగ్లిష్ మీడియం బోధన విషయంలో మద్దతు దక్కుతోంది. కాగా అప్పుడప్పుడూ కొందరు విమర్శలు గుప్పిస్తుండటం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News