పవన్ కు అవన్నీ స్టెప్నీ పార్టీలు.. మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

మీడియా ముందు సినిమా నటుడిగా హావభావాలు ప్రదర్శించే పవన్, మోదీతో భేటీ తర్వాత ఎందుకంత పేళవంగా మారిపోయారని, సంతాప సభలో లాగా ఆ ఎక్స్ ప్రెషన్స్ ఏంటని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.

Advertisement
Update:2022-11-13 08:51 IST

ఆమధ్య పవన్ కల్యాణ్ మూడు వివాహాలపై వచ్చిన కామెంట్లను తిప్పికొట్టేందుకు భార్యలు, స్టెప్నీలు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలతోనే ఆయన మహిళా కమిషన్ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మంత్రి అమర్నాథ్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. పవన్ కల్యాణ్ కి టీడీపీ ఒక్కటే పర్మినెంట్ పార్టీ అని, మిగతా వన్నీ స్టెప్నీ పార్టీలని ఎద్దేవా చేశారు. టీడీపీతో పర్మినెంట్ గా పొత్తు పెట్టుకునే పవన్, మిగతా పార్టీలను ఎప్పుడు ఎలా కావాలంటే అలా మార్చేస్తారంటూ మండిపడ్డారు.

నాదెండ్లతోనే జనసేన నాశనం..

ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ పైనే విమర్శలు ఎక్కుపెట్టే మంత్రులు, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ని కూడా టార్గెట్ చేశారు. ప్రధాని సభ సక్సెస్ అవడంతో దాన్ని డైవర్ట్ చేసేందుకు చిలక గోరింకల్లా పవన్, నాదెండ్ల రిషికొండలో విహారానికి వెళ్లారని సెటైర్లు వేశారు మంత్రి అమర్నాథ్. ఎప్పటికైనా నాదెండ్ల మనోహరే జనసేనను బంగాళాఖాతంలో కలిపేస్తారని ఎద్దేవా చేశారు. జనసేన పొలిటికల్ పార్టీ కాదని, సినిమా పార్టీ అని అన్నారు అమర్నాథ్.

ఆ ఎక్స్ ప్రెషన్స్ ఏంటి పవన్..?

ప్రధానితో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ స్పీచ్ కానీ, ఎక్స్ ప్రెషన్స్ కానీ వైసీపీ నేతలకు నచ్చినట్టు లేవు. ఆయన హావభావాలపై కూడా మంత్రి అమర్నాథ్ మండిపడ్డారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత పవన్ వ్యాఖ్యలు సంతాప సభలో మాట్లాడినట్లున్నాయని అన్నారాయన. మీడియా ముందు సినిమా నటుడిగా హావభావాలు ప్రదర్శించే పవన్, మోదీతో భేటీ తర్వాత ఎందుకంత పేళవంగా మారిపోయారని, సంతాప సభలో లాగా ఆ ఎక్స్ ప్రెషన్స్ ఏంటని ప్రశ్నించారు. మొత్తమ్మీద విశాఖలో మోదీతో పవన్ చర్చలు వైసీపీలో మాత్రం సంతోషాన్ని నింపాయనే చెప్పాలి.

ఈ భారీ ప్రాజెక్ట్ ను మహారాష్ట్ర నుంచి అన్యాయంగా గుజరాత్ కి తరలించింది కేంద్రం. ఈ తరలింపులో గుజరాత్ ప్రత్యేక చొరవ ఏమీ లేదు, కేవలం కేంద్రం ఒత్తిడి మాత్రమే కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల అంశం వారికి కలిసొచ్చింది. మొత్తం మూడు ప్రాజెక్ట్ లను కేంద్రం ఇక్కడికి తరలించింది. సెమీ కండక్టర్ల ప్లాంట్ కి మహారాష్ట్ర అనువైన ప్రాంతం కాదని నింద వేస్తే, రేపు మిగతా కంపెనీలు ఆ రాష్ట్రాన్ని ఎందుకు ఎంపిక చేసుకుంటాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్ తరలించారు సరే చివరకు ఈ నిందలు దేనికంటూ మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు.

Tags:    
Advertisement

Similar News