నీలా బ్యాక్‌డోర్ పొలిటీషియ‌న్‌ను కాదు.. లోకేష్‌కు మంత్రి అమ‌ర్నాథ్ కౌంట‌ర్‌

మట్టి కుండలో పప్పు.. ఉప్పు, కారం కలిపి సిద్ధంగా ఉంచాన‌ని, దాన్ని లోకేష్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని అమ‌ర్‌నాథ్ కామెంట్ చేశారు.

Advertisement
Update:2024-02-20 19:57 IST
నీలా బ్యాక్‌డోర్ పొలిటీషియ‌న్‌ను కాదు.. లోకేష్‌కు మంత్రి అమ‌ర్నాథ్ కౌంట‌ర్‌
  • whatsapp icon

నీలా నేను బ్యాక్‌డోర్ పొలిటీషియ‌న్‌ను కాదు.. క‌ష్ట‌ప‌డి కింది స్థాయి నుంచి పైకి వ‌చ్చానంటూ మంత్రి గుడివాడ అమ‌ర్‌నాథ్ టీడీపీ జాతీయ కార్య‌దర్శి నారా లోకేష్‌కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. అవినీతి చేసినట్టు కానీ, భూ ఆక్రమణలకు పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను అంటూ సవాల్ విసిరారు.

ప‌వ‌నే ఏం చేయ‌లేక‌పోయాడు.. నువ్వెంత‌?

పవన్ కళ్యాణే న‌న్నేం పీక‌లేక‌పోయారు.. నువ్వెంత అని మంత్రి అమ‌ర్నాథ్‌ లోకేష్‌ను నిల‌దీశారు. పూరి గుడిసె నుంచి ప్యాలెస్‌లోకి ఎలా ఎదగగలిగావో చెప్పగలవా లోకేష్ అని ప్ర‌శ్నించారు. 420ల‌ను వెంట‌బెట్టుకుని నామీద ప్రెస్‌మీట్లు పెడ‌తావా.. ముందు వాళ్లు ఎలాంటి వారో చూసుకో అని లోకేష్‌కు స‌ల‌హా కూడా ఇచ్చేశారు.

ప‌ప్పులో ఉత్త‌రాంధ్ర కారం క‌లిపా..

మట్టి కుండలో పప్పు.. ఉప్పు, కారం కలిపి సిద్ధంగా ఉంచాన‌ని, దాన్ని లోకేష్‌కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌ని అమ‌ర్‌నాథ్ కామెంట్ చేశారు. చంద్రబాబు,లోకేష్‌లలో పౌరుషం, రోషం రావాలనే పప్పులో ఉత్తరాంధ్ర ఉప్పు, కారం కలిపాన‌ని ఎద్దేవా చేశారు.

Tags:    
Advertisement

Similar News