తాజ్ మహల్ తో సెల్ఫీ.. లోకేష్ కి దిమ్మతిరిగే కౌంటర్

తండ్రీ కొడుకులిద్దర్నీ ఇలాగే వదిలేస్తే.. రేపు తాజ్ మహల్ ముందు కూడా సెల్ఫీ దిగి దాన్ని కట్టించింది తామేనని చెప్పుకుంటారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Advertisement
Update:2023-04-11 21:37 IST

ఆమధ్య లోకేష్ కియా ఫ్యాక్టరీ ముందు, ఇటీవల చంద్రబాబు నెల్లూరు టిడ్కో ఇళ్ల ముందు సెల్ఫీలు దిగి సీఎం జగన్ కి ఛాలెంజ్ విసిరారు. మా హయాంలో సాధించిన అభివృద్ధి ఇది, మీ హయాంలో మీరు చేసిందేంటి..? అని సూటిగా ప్రశ్నించారు. ఈ ఛాలెంజ్ లకు వైసీపీ నుంచి కూడా కౌంటర్లు పడ్డాయి. అయితే మంత్రి ఆదిమూలపు సురేష్ ఇప్పుడు మరింత సెటైరిక్ గా స్పందించారు. తండ్రీ కొడుకులిద్దర్నీ ఇలాగే వదిలేస్తే.. రేపు తాజ్ మహల్ ముందు కూడా సెల్ఫీ దిగి దాన్ని కట్టించింది తామేనని చెప్పుకుంటారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

ఇటీవల నారా లోకేష్ ఇన్నోవా కార్ల ముందు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా పోస్ట్ చేసే సమయంలో వాటి నెంబర్ ప్లేట్లు కనపడకుండా జాగ్రత్త పడ్డారు. ఆ కార్లన్నీ టీడీపీ హయాంలో ఎస్సీలకు ఇచ్చినవని గుర్తు చేశారు లోకేష్. సీఎం జగన్ ఎస్సీలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం కాస్త సంచలనం కావడంతో మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. కార్లముందు లోకేష్ ఫొటోలు దిగి ఎస్సీలను ఉద్ధరించినట్టు పోజులు కొడుతున్నాడని అన్నారు మంత్రి. అసలు టీడీపీ హయంలో ఇచ్చిన ఇన్నోవాలు నిజంగానే ఎస్సీలకే ఇచ్చారా అని ప్రశ్నించారు. ఆ కార్ల వ్యవహారం పై చర్చకు వచ్చే దమ్ము లోకేష్‌ కు ఉందా అని సవాల్‌ విసిరారు.

ఎస్సీలకు కార్ల పేరుతో అప్పటి టీడీపీ ప్రభుత్వం మధ్యవర్తులకు దోచిపెట్టిందని మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్. సీఎం జగన్ పాలనలో నేరుగా పేదవాడికే లబ్ది చేకూరుతోందని, దళారీల పాత్ర లేనే లేదన్నారు. పేదలు వైసీపీకి అండగా ఉన్నారనే అక్కసుతో తండ్రి కొడుకులు సెల్ఫీ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. తాజ్ మహల్ ముందు కూడా సెల్ఫీలు దిగుతారేమోనని సెటైర్లు పేల్చారు.

Tags:    
Advertisement

Similar News