చంద్రుడు ప్రశాంతంగా జైలులో ఉన్నాడు

చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. ఏపీలో ప్రస్తుతం రెండే ఆప్షన్స్ ఉన్నాయని, ఒకటి తెలుగుదేశం, రెండు జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ అని చెప్పుకొచ్చారు.

Advertisement
Update:2023-09-26 10:56 IST

టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు అరెస్టుపై తెలుగు రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణకు సంబంధించిన పార్టీలు ఇప్పటివరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కానీ, నాయకులు మాత్రం వారి సొంత అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అరెస్టుపై MIM చీఫ్‌ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. చంద్రబాబును ఉద్దేశించి అసద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

ఆంధ్రాలో చంద్రుడు ప్రశాంతంగా జైల్లో ఉన్నాడంటూ కామెంట్ చేశారు అసదుద్దీన్. చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసన్నారు. ఏపీలో ప్రస్తుతం రెండే ఆప్షన్స్ ఉన్నాయని, ఒకటి తెలుగుదేశం, రెండు జగన్‌మోహన్‌ రెడ్డి పార్టీ అని చెప్పుకొచ్చారు. జగన్‌ పాలన పర్వాలేదన్నారు అసదుద్దీన్‌. ఆంధ్రప్రదేశ్‌లోనూ MIM పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే అన్ని చోట్లకు తాను రావడం కుదరదని, మీరే నాయకులుగా ఎదగాలంటూ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.


రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో అసదుద్దీన్ ఈ కామెంట్స్ చేశారు. రెండు రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాలు, పార్టీ విస్తరణ, బలోపేతంపై చర్చించారు. తెలంగాణలో MIM పోటీ చేయని చోట బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో 9 ఏళ్లుగా ఎలాంటి మత కలహాలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందంటూ ప్రశంసించారు.

Tags:    
Advertisement

Similar News