ఏపీ కేబినెట్‌ కీలక పలు నిర్ణయాలు

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Advertisement
Update:2024-10-23 17:28 IST

ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక సరిగా అమలయ్యేలా చూడాలని మంత్రులు, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక లేని జిల్లాల్లో మినరల్‌ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేపట్టాలని నిర్ణయించారు. ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు, సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆశ్రయన్నికి చెందిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.

ఫ్రీ ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ చార్జీల రద్దుకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సీనరేజ్ చార్జీల వల్లే ప్రభుత్వంపై రూ. 264 కోట్లు భారం అని అంచనా వేసింది. పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉచితంగా ఇసుక పంపిణీ పథకంలో ట్రాక్టర్లు, లారీలతో పాటుగా ఎడ్లబండ్లలో కూడా ఇసుక తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఇక చెత్త పన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లో అక్రమాలపై చర్యలకు కమీటి నియమించారు.

Tags:    
Advertisement

Similar News