జనసేనలోకి మంచు మనోజ్, భూమా మౌనిక
నేడు ఆళ్లగడ్డ కు భారీ కార్ల ర్యాలీగా.. ఆ తర్వాత రాజకీయ ప్రకటన
Advertisement
మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక రాజకీయ రంగప్రవేశానికి సర్వం సిద్ధమైంది. మనోజ్, మౌనిక దంపతులు జనసేనలో చేరనున్నారు. సోమవారం ఆళ్లగడ్డ లో మౌనిక తల్లి, మాజీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వెయ్యి కార్లతో భారీ ర్యాలీగా వెళ్లాలని నిర్ణయించారు. భూమా ఘాట్ లో రాజకీయ ఆరంగేట్రంపై దంపతులు ప్రకటించనున్నారు. మంచు మనోజ్ కు ఆయన తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుతో విభేదాలు పొడచూపాయి. దీంతో మనోజ్ ను ఇంట్లో నుంచి బయటకు పంపారు. మౌనిక అక్క టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మనోజ్, మౌనిక జనసేనలో చేరుతుండటం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నంద్యాల నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగే యోచనలో మౌనిక ఉన్నారు.
Advertisement