అభాసుపాలవుతున్న పాదయాత్ర
అసలు లోకేష్ ఎందుకు పాదయాత్ర మొదలుపెట్టాడబ్బా అని తెలుగుదేశం పార్టీ శ్రేణులే నిట్టూర్చే స్థాయిలో ఉంది పరిస్థితి. మాట్లాడిన ప్రతిచోటా తెలుగు కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు. ఇక లోకేష్‌తో పాటు నడుస్తున్నవారిలో కొన్నిచోట్ల జనాలు చాలా తక్కువగా కనబడుతున్నారు.
లోకేష్ పాదయాత్ర మొదటిరోజు నుండి అభాసుపాలవుతునే ఉంది. అసలు లోకేష్ ఎందుకు పాదయాత్ర మొదలుపెట్టాడబ్బా అని తెలుగుదేశంపార్టీ శ్రేణులే నిట్టూర్చే స్థాయిలో ఉంది పరిస్థితి. తాను మాట్లాడిన ప్రతిచోటా తెలుగు కూడా సరిగా మాట్లాడలేకపోతున్నారు. మాట్లాడిన పది నిముషాల్లో చాలా తప్పులు దొర్లుతున్నాయి. ఇక యువగళంలో లోకేష్‌తో పాటు నడుస్తున్నవారిలో కొన్నిచోట్ల జనాలు చాలా తక్కువగా కనబడుతున్నారు. మొదటి నుండి లోకేష్ పాదయాత్రపై మంత్రులు, వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.
వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో పాదయాత్ర డెవలప్మెంట్లను పీకి పాకం పెడుతున్నారు. సరే వైసీపీ సంగతిని పక్కనపెడితే నడిచినంత దూరం లోకేష్‌తో పాటు జనాలుండేట్లు చూసుకోవటంలో చంద్రబాబునాయుడు కూడా ఫెయిలైనట్లే ఉన్నారు. కొన్నిచోట్ల జనాలు పర్వాలేదన్నట్లుంటే మరికొన్ని చోట్ల పట్టుమని 100 మంది కూడా కనబడటంలేదు. ఈ వంద మందిలో వలంటీర్లు, సెక్యూరిటి సిబ్బందిని తీసేస్తే మామూలు జనాలు 40 మంది కూడా కనబడటంలేదు.
ఇవన్నీ లోకేష్ పాదయాత్రలో కొట్టొచ్చినట్లు కనబడుతున్న లోపాలు. ఇక పార్టీ నేతలతో జరిగిన సమావేశాల్లో కొందరైతే డైరెక్టుగా కుప్పంలో పార్టీ పరిస్ధితి ఏమీ బాగాలేదని మొహంమీదే చెప్పేస్తున్నారు. దీన్ని వైసీపీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తోంది. ఇవన్నీ సరిపోవన్నట్లుగా వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ వనితను ఉద్దేశించి లోకేష్ అనుచితంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అయ్యాయి. చంద్రబాబే స్వయంగా భూస్థాపితం చేసేసిన ప్రత్యేక హోదాను జగన్మోహన్ రెడ్డి ఎందుకు సాధించలేదని లోకేష్ అడగటమే విచిత్రంగా ఉంది.
ఇక లోకేష్ ఒకచోట కూరగాయలు అమ్ముకునే ఇద్దరు మహిళలతో మాట్లాడిన ఫొటో బాగా నెగిటివ్ అయ్యింది. వాళ్ళిద్దరు రైతులూ కాదు కూరగాయల వ్యాపారులూ కాదు. వాళ్ళిద్దరు టీడీపీ నేతలు అరేంజ్ చేసిన మనుషులు. వాళ్ళిద్దరి ముందు ఎల్లో పట్టా పరిచేసి నాలుగు బంగాళదుంపలు, కొన్ని ముల్లంగిలు, కొన్ని వంకాయలు, బుట్టలో నిమ్మకాలయను పెట్టారు. వాళ్ళిద్దరినీ కూరగాయలు అమ్ముకునే మహిళల్లాగ కూర్చోబెట్టారు. వాళ్ళ దగ్గరి లోకేష్ ఆగి మాట్లాడినట్లుగా ఫొటోలను రిలీజ్ చేశారు. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళే పాదయాత్రలో లోకేష్‌తో మాట్లాడుతున్న ఫొటోల్లో కనిపించారు. దీంతో టీడీపీవాళ్ళ స్టేజి షో అర్థమైపోయింది. ఇలాంటి స్టేజి షోలతోనే లోకేష్ పాదయాత్ర అభాసుపాలవుతోంది.