మహిళను చంపి తల తీసుకెళ్లిన చిరుత.. - నంద్యాల జిల్లాలో ఘటన

వెంటనే గట్టిగా కేకలేస్తూ తమ వెంట తెచ్చుకున్న కర్రలతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా, చిరుత మెహరూన్‌బీ తల భాగాన్ని లాక్కెళ్లిపోయింది. ఊహించని ఈ ఘటన పచ్చర్ల గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

Advertisement
Update: 2024-06-26 02:23 GMT

వంట చెరకు కోసం వెళ్లిన మహిళపై చిరుత పులి దాడి చేసి ప్రాణం తీసింది. నంద్యాల జిల్లాలోని శిరివెళ్ల, మహానంది మండలాల సరిహద్దు ప్రాంతంలోని పచ్చర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

శిరివెళ్ల మండలంలోని పచ్చర్లకు చెందిన షేక్‌ మెహరూన్‌బీ (45) మాజీ ఉప సర్పంచ్‌. ఆమె మంగళవారం ఉదయం వంట చెరకు కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఆమె ఎంతకీ ఇంటికి చేరుకోక‌పోవడంతో ఇద్దరు కుటుంబసభ్యులు అటవీ ప్రాంతంలోకి వెళ్లి గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో మెహరూన్‌బీని అప్పటికే చంపేసిన చిరుత పులి ఆమె ఛాతీ, తల, కడుపు భాగాన్ని తినేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో వారు ఒక్కసారిగా హతాశులయ్యారు. వెంటనే గట్టిగా కేకలేస్తూ తమ వెంట తెచ్చుకున్న కర్రలతో అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా, చిరుత మెహరూన్‌బీ తల భాగాన్ని లాక్కెళ్లిపోయింది. ఊహించని ఈ ఘటన పచ్చర్ల గ్రామస్తులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

Tags:    
Advertisement

Similar News