డేటా చౌర్యం వ్యవహారంలో ఆందోళన పడుతున్న టీడీపీ

ఆంధ్రప్రదేశ్ లో డేటా చౌర్యం వ్యవహారం పై కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన గల సభా సంఘం మంగళ వారం అసెంబ్లీలో మధ్యంతర నివేదికను సమర్పించింది. ఈ నివేదిక వెల్లడించిన అంశాలతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలైంది.

Advertisement
Update:2022-09-20 17:27 IST

డేటా చౌర్యం వ్యవహారంలో టీడీపీలో ఖంగారు మొదలయింది. దీనిపై అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టడంతో వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని అర్థం అయింది. రాష్ట్రంలోని 18 స్టేట్ డేటా సర్వర్ల నుంచి డేటాను చౌర్యం చేసినట్లు నిర్ధారణ అవడంతో ఈవిషయాన్ని అధికార పక్షం చాలా సీరియస్ గా తీసుకుంది. గూగుల్ తో సంప్రదింపులు చేస్తోంది. అధికార పక్షం వెళుతోన్న విధానం, ఇప్పటికే సేకరించిన సమాచారం సీరియస్ గా ఉండటంతో పరిస్థితులు ఎటు నుంచి ఎటు మళ్లతాయో అని ప్రతిపక్షం ఆందోళన చెందుతోంది.

డేటా చౌర్యం వ్యవహారంపై శాసనసభకు మధ్యంతర నివేదిక మంగళ వారం అసెంబ్లీలో సభా సంఘం సమర్పించింది . భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పడిన సభాసంఘం మొత్తం 85 పేజీలతో కూడిన మధ్యంతర నివేదికను శాసనసభకు అందించింది. డేటా చౌర్యం వ్యవహారంపై సమగ్ర వివరాల కోసం గూగుల్ కు లేఖ రాశారు. భూమన నేతృత్వంలోని హౌస్ కమిటీ.స్టేట్ డేటా సెంటర్ సర్వర్ల నుంచి గుర్తు తెలియ‌ని సర్వర్ ఐపీలకు వెళ్లిన వివరాలను ఇవ్వాల్సిందిగా గూగుల్ ను కోరింది.సభా సంఘం పంపిన ఐపీ అడ్రస్సుల వివరాలను గుర్తించలేమని గూగుల్ సంస్థ తేల్చి చెప్పింది. సదరు ఐపీ అడ్రస్సులు గూగుల్ కు చెందినవే అయినా ప్రత్యేకంగా ఎవరికీ కేటాయించలేదని, వాటిని గుర్తించడం కష్టమని గూగుల్ స్పష్టం చేసింది. దీనిపై తదుపరి సంప్రదింపుల కోసం తమ న్యాయవిభాగానికి ఈమెయిల్ పంపాలని గూగుల్ సూచించింది. వేర్వేరు సర్వర్లలోని ఐపీ అడ్రస్ ల జాబితాను నివేదికలో భూమన కమిటీ పొందుపర్చింది.

ఏపీ కంప్యూటర్ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ పర్యవేక్షణలో రాష్ట్రంలోని కంప్యూటర్ నెట్ వర్క్ , డేటా భద్రత, సర్వర్ల వివరాలను ఇంటెలిజెన్స్ విభాగం విశ్లేషించింది. డేటా చౌర్యానికి సంబంధించిన లావాదేవీలు లాగ్స్ రూపంలో సేకరించింది.రాష్ట్రంలోని 18 స్టేట్ డేటా సెంటర్ల నుంచి పెద్ద మొత్తంలో డేటా చౌర్యం జరిగినట్లు గుర్తించింది. 2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31 తేదీ వరకూ ఈ డేటా చౌర్యం అయినట్లు తేల్చింది. అధికారిక అనుమతుల్లేకుండా డేటా ట్రాన్సఫర్ జరిగిందని నిర్ధారణకు వచ్చింది. రాష్ట్ర డేటా సెంటర్ సర్వర్ల నుంచి బయట సర్వర్లకు మార్పిడి జరిగిన ఈ డేటా వివరాలు, ఐపీ అడ్రస్ లను కూడా గూగుల్ గుర్తించలేకపోయిందని అభిప్రాయ పడింది.రాష్ట్రంలోని పౌరులకు సంబంధించిన సున్నితమైన సమాచారం 2018 నవంబర్ 30 నుంచి 2019 మార్చి 31 తేదీ మధ్య ఎస్డీసీ నుంచి గుర్తు తెలియ‌ని సర్వర్లకు డేటా చౌర్యం జరిగినట్లు కమిటీ ఈరోజు అసెంబ్లీలో సమర్పించిన నిదికలో పొందుపరిచింది.

Tags:    
Advertisement

Similar News