బాలయ్యను డైరెక్ట్ ఎటాక్ చేసిన కొడాలి

తండ్రిచావుకు కారణమైన చంద్రబాబుతో షో చేయటానికి సిగ్గుందా ? అంటు మండిపోయారు. తండ్రిచావుకు కారకుడైన చంద్రబాబుతో షో ఎలా చేస్తారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.

Advertisement
Update:2022-10-14 13:18 IST

మాజీ మంత్రి కొడాలి నాని వైఖరి ఆశ్చర్యంగా ఉంది. ఎన్టీఆర్ వెన్నుపోటు ఘటనలో ఇంతకాలం కొడాలి కేవలం చంద్రబాబును మాత్రమే ఎటాక్ చేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్ వెన్నుపోటులో చంద్రబాబుకు ఎన్టీఆర్ వారసులంతా సహకరించిన మాట వాస్తవం. వారసులు సహకరించకపోతే చంద్రబాబు అంత ధైర్యం చేసేవారు కాదు. వెన్నుపోటు ఘటన తర్వాత జరిగిన పరిణామాల కారణంగా పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు మళ్ళీ ఎన్టీఆర్ వైపు వచ్చేశారు.

వెన్నుపోటులో ఎవరిపాత్ర ఎంతన్న విషయంలో స్పష్టత లేకపోయినా మొత్తంమీద ఎన్టీఆర్ అభిమానులు, న్యూట్రల్స్ మాత్రం చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో చంద్రబాబును కొడాలి కూడా పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటివరకు కొడాలి పొరబాటున కూడా ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవరినీ పల్లెత్తు మాటనలేదు. అలాంటిది ఇప్పుడు కొడాలి డైరెక్టుగా నందమూరి బాలకృష్ణను డైరెక్టుగా ఎటాక్ చేశారు.

తండ్రిచావుకు కారణమైన చంద్రబాబుతో షో చేయటానికి సిగ్గుందా ? అంటు మండిపోయారు. తండ్రిచావుకు కారకుడైన చంద్రబాబుతో షో ఎలా చేస్తారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ మరణించి 25 ఏళ్ళయినా ఇంకా అందరు కలిసి ఆయన ఆత్మను క్షోభ పెడుతూనే ఉన్నారంటూ ఆవేద‌న వ్యక్తంచేశారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పోడిచి ఆయన చావుకు కారణమైంది సరిపోక చాట్ షోల పేరుతో అసత్యాలు ప్రచారం చేస్తారా అంటూ చంద్రబాబు, బాలయ్యపై కొడాలి రెచ్చిపోయారు.

పార్టీని కాపాడటానికే 1995లో అలా చేయాల్సొచ్చిందని చంద్రబాబు చెబితే దాన్ని బాలకృష్ణ ఆమోదించటం ఏమిటంటూ నిలదీశారు. ఇదే విషయమై ఒక ఛానల్ నిర్వహించిన డిబేట్లో మాట్లాడిన కాలర్సంతా ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయపడ్డారు. అయితే ఇప్పటి తరానికి 1995లో ఏమి జరిగిందో తెలిసే అవకాశం లేదు. అలాంటిది కోరిమరీ బావా, బావమరుదులు వెన్నుపోటు ఎపిసోడ్ ను ఎందుకు గోక్కుంటున్నారో అర్థంకాలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కొడాలి మాట్లాడటం మామూలే. కానీ బాలయ్య మీద బహిరంగంగానే రెచ్చిపోయారంటే దీనివెనుక ఏదో వ్యూహం ఉన్నట్లే ఉంది. నాలుగు రోజులాగితే అదేమిటో తెలుస్తుంది.

Tags:    
Advertisement

Similar News