నువ్వు జగన్‌కు ఆహారం అయిపోతావ్ - కొడాలి నాని

వర్థంతికి, జయంతికి తేడా తెలియకపోయినా ప్రమాదం లేదని.. అదే పులికి, పిల్లికి తేడా తెలియకపోతే పులికి ఆహారం అయిపోతావ్ అని లోకేష్‌ను హెచ్చరించారు.

Advertisement
Update:2022-10-21 13:21 IST

డబ్బులిచ్చి భార్యలతో సెటిల్‌మెంట్లు చేసుకోవాల‌ని చెప్పిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు మాజీ మంత్రి కొడాలి నాని. టీడీపీకి నాలుగు చానళ్లు ఉంటే తమకు సాక్షి మాత్రమే ఉందన్నారు. అందుకే ప్రతి విషయాన్ని మీడియాతో డైవర్ట్ చేస్తున్నారని కొడాలి విమర్శించారు. అందులో భాగంగానే దత్తపుత్రుడు, సొంత పుత్రుడిలో సీఎంను తిట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రిని పట్టుకుని ప్యాలెస్ పిల్లి నా కొడుకు అని లోకేష్ మాట్లాడారని.. తిరిగి తాము ఏమైనా అంటే మాత్రం ఏడ్చేస్తారని కొడాలి మండిపడ్డారు. కేవలం జగన్‌ పథకాల మీద చర్చ జరగకూడదన్న ఉద్దేశంలోనే ఒకసారి దత్తపుత్రుడితో మరొకసారి పప్పు పుత్రుడితో తిట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు.

వర్థంతికి, జయంతికి తేడా తెలియకపోయినా ప్రమాదం లేదని.. అదే పులికి, పిల్లికి తేడా తెలియకపోతే పులికి ఆహారం అయిపోతావ్ అని లోకేష్‌ను హెచ్చరించారు. ఇప్పటికే మంగళగిరిలో ఒకసారి జగన్‌కు ఆహారం అయిపోయావ్ మరోసారి కావొద్దని సూచించారు. కొడుకు సమర్థుడు కాదు కాబట్టే ఈ వయసులో కూడా హోటల్‌కు వెళ్లి పక్క పార్టీ నేతల కాళ్లను చంద్రబాబు పట్టుకుంటున్నారని కొడాలి విమర్శించారు.

తాము విమర్శిస్తే బూతులు అని మాట్లాడే జీరో పర్సెంట్‌ ఓటు పార్టీల వెధవలు మరి సీఎంను పిల్లి నా కొడుకు అనడం తప్పు అని లోకేష్‌కు ఎందుకు చెప్పడం లేదని కొడాలి ప్రశ్నించారు. జగన్‌ వల్ల ప్రజాస్వామ్యానికి ఎక్కడ ప్రమాదం వచ్చిందో చెప్పాలన్నారు. అమిత్ షా తిరుమల వస్తే చెప్పులు వేయించింది ఎవరు? ప్రధాని మోడీ వస్తే ఆయన హెలికాప్టర్‌కు అడ్డుగా గ్యాస్‌ నింపిన బెలూన్లను ఎగరవేయించింది ఎవరు?, రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా సరే రోజాను సభలో రాకుండా అడ్డుకున్నది ఎవరు అని ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని నలుగురిని మంత్రులుగా చేసినప్పుడు ఈ జీరో పర్సెంట్ పార్టీలకు ప్రజాస్వామ్యం అప్పుడు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

జగన్‌ మోహన్ రెడ్డికి ఒకే ఒక్క గేమ్ వచ్చని.. అదే పొలిటిక్ ఫుట్‌బాల్ కొడాలి నాని అన్నారు. అందరూ కలిసి వచ్చినా ఒకే తన్నుతో అందరినీ సెట్‌ చేయగల సమర్థుడు జగన్‌ అని కొడాలి వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News