ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు మంత్రి వర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు.

Advertisement
Update:2024-11-20 21:05 IST

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్రీడా, పర్యాటక కొత్త విధానాలకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మంత్రి వర్గ సమావేశంలో పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది. జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్ఫ్రా, ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్ 2019 రిపీట్ చేయాలని ప్రతిపాదించారు. 2024-25 కొత్త క్రీడా పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో చైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకు సవరించింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్‌గా మారుస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవే కాదు.. మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా మంత్రివర్గ సమావేశాంలో ఆమోదించారు.

Tags:    
Advertisement

Similar News